సహజంగా సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న అందాల భామల్లో దాదాపుగా అందరూ తెలుగు రాని ఆడపడుచులే. అయితే వారు సినిమాకు సంభందించిన వేదికలపై ఒక్క మాట మాట్లాడితే చాలు అభిమానులంతా ఉబ్బితబ్బిబ్బైపోతారు. అలాంటి అందాల భామలకు వెనుకనుండి డబ్బింగ్ చెబుతూ ఆ భామల భావాలకు తమ స్వరంతో సోయగాలు అల్లుతున్న వారు వీరే…
సునీత ఉపద్రస్థ
ఈ భామ పాటల్లోనే కాదు..డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను చాలా పాప్యులర్ అనే చెప్పాలి. ఇప్పటివరకూ టాప్ హీరోయిన్స్ అయిన కత్రీనా కైఫ్, తమన్నా, నయనతార వంటి భామలకు తన స్వరాన్ని అందించి వారి నటనకు అందాన్ని తెచ్చింది. ఇక ఇదే కోవలో జయం, ఆనంద్, శ్రీ రామరాజ్యం చిత్రాలకు గాను నంది అవార్డ్ ను సొంతం చేసుకుంది.
చిన్మయీ శ్రీపాద
అందాల భామ సమంతాను తన స్వరంతో పాప్యులర్ చేసింది ఈ డబ్బింగ్ భామనే. ఏం మాయ చేశావే చిత్రంలో సమంతా స్వరానికి ఫిదా అయిపోయారు యావత్ యువ లోకం, ఆ పాత్రకు తన స్వరంతో ప్రాణం పోసినా ఈ భామ, లావణ్య త్రిపాటి కి కూడా తన స్వరాన్ని అందించింది. ఇక ఏం మాయ చేశావే చిత్రానికి ఈ భామ నంది అవార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.
సౌమ్య శర్మ
కాజల్, సమంతా, అమల పాల్ లాంటి అందాల భామలకు తన స్వరాన్ని అందించింది. అంతేకాకుండా మహాత్మ, లక్ష్యం సినిమాలకు నంది అవార్డ్ ను కూడా కైవసం చేసుకోవడం విశేషం.
హరిత
ఇలియాన, మాధవీ లత లాంటి భామలకు తన స్వరాన్ని అందించింది. నచ్ఛావులే చిత్రానికి గాను నంది అవార్డ్ ఈమెను వరించింది.
సరిత
రమ్య కృష్ణ, నగ్మ, సౌందర్య వంటి అందాల ఆగ్రా తారలకు తన స్వరాన్ని అందించిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్, 1997లో మా ఆయన బంగారం సినిమాకు, 1999లో అనంతపురం సినిమాకు నంది అవార్డ్ ను దక్కించుకుంది
సవిత రెడ్డి
త్రిష, రాశి ఖన్నా వంటి భామలకు తన స్వరాన్ని అందించింది ఈ భామ. అదే క్రమంలో నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు వంటి చిత్రాలకు గాను నంది అవార్డ్ ను కైవసం చేసుకుంది.
స్వాతి రెడ్డి
జల్సా చిత్రంలో ఇలాయానాను అందంగా, చిన్న పిల్ల మనస్తత్వం కలిగిన అమ్మాయిలాగా త్రివిక్రమ్ చూపిస్తే, ఆమె అందానికి అమాయకత్వాన్ని తన స్వరంతో జోడించింది స్వాతి రెడ్డి
శ్రావణ భార్గవి
గబ్బర్ సింగ్ లో శ్రుతి హసన్ కు స్వరాన్ని అందించింది ఈ భామనే.
రోజా రమణి
శిల్పా శెట్టి, రోజా, మీనా లాంటి వాళ్ళకి స్వరాన్ని అందించారు రోజా రమణి.
వీణ ఘంటసాల
కంగన రనౌత్, జెనీలియా, అద శర్మ వంటి తారలకు స్వరాన్ని అందించింది ఈ భామ.
ఎస్.పీ శైలజ
సోనాలీ బింద్రె, శ్రీదేవి, టబూ వంటి అగ్రతారలకు తన స్వరాన్ని అందించారు ఎస్.పీ శైలజ.
కమలా దేవి
అలనాటి ఆణిముత్యాలకు తన స్వరంతో ప్రాణం పోశారు కమల దేవి, ఎంతో మంది అప్పటి తారలకు తన స్వరాన్ని అందించి మెప్పించారు.