టెక్నాలజీ బాగా విస్తరించిన ఈ టైములో విజువల్ ఎఫెక్ట్స్ కలిగిన సినిమాలు చాలానే వస్తున్నాయి. అయితే టెక్నాలజీ అంతంత మాత్రంగానే ఉన్న రోజుల్లో కూడా ‘అమ్మోరు’ ‘దేవి’ ‘దేవుళ్ళు’ ‘త్రినేత్రం’ వంటి గ్రాఫికల్ వండర్స్ ను మనకు అందించారు దర్శకులు కోడి రామకృష్ణ. చెప్పాలంటే అప్పట్లో ఈయన ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారనే చెప్పాలి. 2009 నాటికి ఈయన తోటి దర్శకులు అందరూ ఫేడౌట్ అయిపోయి ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతుంటే.. ఈయన ‘అరుంధతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.
ఆ చిత్రం అనుష్కకి స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న స్టార్ ఇమేజ్ అంతా ఆ సినిమా ద్వారా సంపాదించుకున్నదే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాలను పక్కన పెడితే.. ఈ సినిమాలో ‘అరుంధతి’ తండ్రిగా ఓ పెద్దాయన నటించారు అతను అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ పెద్దాయన పేరు శంకర్. ఆ సినిమాకి ముందు ఆయన ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ఆయన కొడుకులు కూడా హీరోలే అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ‘చంటిగాడు’ సినిమాలో హీరోగా నటించాడే బాలాదిత్య.. అతను ఇతని కొడుకే..! అంతేకాదు బుల్లితెర పై పలు సీరియల్స్ లో హీరోగా నటించిన కృష్ణ కౌశిక్ ఈయన పెద్ద కొడుకు కావడం విశేషం. వీళ్లిద్దరు ఇప్పుడు బుల్లితెర పైనే కంటిన్యూ అవుతున్నారు. కృష్ణ కౌశిక్ ‘ఆరుగురు పతివ్రతలు’ అనే సినిమాలో కూడా నటించాడు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!