Arundhati Collections: ‘అరుంధతి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

అనుష్క .. ‘సూపర్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మహానంది’ ‘అస్త్రం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అవి పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత చేసిన ‘విక్రమార్కుడు’ ‘లక్ష్యం’ ‘శౌర్యం’ వంటి సినిమాలు ఈమెకు సక్సెస్ ను అందించాయి. కానీ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది మాత్రం 2009 జనవరి 16న రిలీజ్ అయిన ‘అరుంధతి’ సినిమానే అని చెప్పాలి. ‘మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకుడు.

ఎటువంటి అంచనాలు లేకుండా ఆ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా అనుష్కకి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  11.40 cr
సీడెడ్  5.90 cr
ఉత్తరాంధ్ర  2.50 cr
ఈస్ట్  2.40 cr
వెస్ట్  2.15 cr
గుంటూరు  2.80 cr
కృష్ణా  2.10 cr
నెల్లూరు  1.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 30.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  3.60 cr
 ఓవర్సీస్  1.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  36.15 cr (షేర్)

‘అరుంధతి’ (Arundhati) చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. చాలా ఏరియాల్లో ఈ సినిమాని రెంట్ల బేస్ పై ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమా రూ.36.15 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.20 కోట్ల వరకు లాభాలను పంచింది. ఆ టైంకి టాలీవుడ్ టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచింది ‘అరుంధతి’.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus