Rajinikanth,Arvind Swamy: రజనీ నేలపై.. అరవింద స్వామి మంచంపై..!

రజనీకాంత్‌ చాలా నిరాడంబరంగా ఉంటారని అతనితో పని చేసిన నటులు గతంలో చాలామంది చెప్పారు. పెద్ద సూపర్‌ స్టార్‌ అనే గర్వం కానీ, ఆ యాటిట్యూడ్‌ కానీ ఎప్పుడూ చూపించరు అని చెబుతుంటారు. గతంలో ఒకటి రెండు ఫొటోలు కూడా అలాంటివి బయటకు వచ్చాయి. సినిమా సెట్‌లో అందరితో కలసిపోయి సామాన్య నటుడిగానే ఉంటాడు. దీంతో రజనీ అభిమానులు మా తలైవా గ్రేట్‌ అని ఆనందంగా చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకోవడానికి మీకు మరో విషయం చెబుతున్నాం. అయితే ఈ విషయం ఇప్పటిది కాదు. ఎప్పుడో ‘దళపతి’ నాటిది.

Click Here To Watch

రజనీకాంత్‌ కెరీర్‌లో ‘దళపతి’ అద్భుతమైన విజయం సాధించిన చిత్రం. ఈ సినిమాలో రజనీకాంత్‌తోపాటు అరవింద్‌ స్వామి కూడా నటించారు. ఇద్దరి మధ్య అద్భుతమైన సన్నివేశాలుంటాయి. ‘దళపతి’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అరవిందస్వామి యువ నటుడు. అప్పుడప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా ఒక రోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత రజనీకాంత్‌ గది అని తెలియక అరవింద్‌ స్వామి లోపలికి వెళ్లాడట. అప్పటికే ఆ గదిలో ఏసీ ఆన్ చేసి ఉండటంతో మంచంపై పడుకొని అలా నిద్రలోకి జారుకున్నారట.

రెండో రోజు ఉదయం లేచి చూసేసరికి… గదిలో నేలమీద రజనీకాంత్‌ పడుకుని ఉన్నారట. దీంతో అరవింద్‌ స్వామికి ఒక్కసారిగా చెమటలు పట్టేశాటయట. గుండెలు గుభేలుమన్నాయట. కంగారుగా బయటికి వెళ్లి యూనిట్‌ సభ్యులకు విషయం చెప్పారట. దానికి వాళ్లు రాత్రి షూటింగ్‌ అయ్యాక మీరు వచ్చి రజనీకాంత్‌ గదిలో… ఆయన మంచం మీదే నిద్రపోయారు. కాసేపటికి రజనీకాంత్‌ వచ్చి చూస్తే మీరు మంచి నిద్రలో ఉన్నారు. దీంతో ఆయన ‘అరవింద్‌ స్వామిని లేపొద్దు. అక్కడే పడుకోనీయండి అని చెప్పారు’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత రజనీ అదే గదిలో నేల మీద పడుకున్నారు అంటూ సినిమా టీమ్‌ చెప్పిందట. దీంతో ఆశ్చర్యపోవడం అరవింద స్వామి వంతైందట. ఎంతైనా రజనీకాంత్‌ గ్రేట్‌ కదా. అదే వేరే హీరోలు ఎవరైనా అయితే కోపమయ్యే వారేమో కదా.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus