దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో మాత్రం థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడిపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నిర్ణయాన్ని కోలీవుడ్ స్వాగతించింది. మిగిలిన ఇండస్ట్రీలు కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించడానికి పర్మిషన్లు వస్తే బాగుటుందని చూస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తమిళ సినీ పరిశ్రమలో అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని పొగుడుతుంటే.. ఒక నటుడు మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ”కొన్ని సందర్భాల్లో వంద శాతం కంటే 50 శాతమే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. ఇది అలాంటి సమయమే” అని అరవింద్ స్వామి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. తమిళనాట థియేటర్ల ఆక్యుపెన్సీని యాభై శాతం నుంచి వంద శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే అరవింద్ ఈ ట్వీట్ చేశాడు.
ఇది చూసిన ఇండస్ట్రీ జనాలు ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్లు వేస్తున్న సమయంలో అరవింద్ వ్యక్తిరేకంగా ట్వీట్ చేయడం వార్తల్లో నిలిచింది. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో వంద శాతం ఆక్యుపెన్సీకి ఛాన్స్ ఇచ్చి ‘మాస్టర్’ లాంటి సినిమాను విడుదల చేస్తే.. థియేటర్ల వద్ద హడావిడి, క్రౌడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ ప్రభాస్ కచ్చితంగా పెరుగుతుంది. ఇదే ఆలోచనతో అరవింద్ స్వామి ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ ని సమర్ధించే వాళ్లు కూడా ఉన్నారు.