Child Artist: అతడు ఏకంగా బ్రో సినిమాలో కూడా నటించాడు.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘ఆర్య 2’.అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ సీక్వెల్ తెరకెక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజి గా నిల్చింది కానీ, అప్పట్లో ఈ చిత్రం లోని పాటలు ఒక సెన్సేషన్.

ఈ సినిమాలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ వల్లే ఆయనకీ పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ వచ్చింది. ఇక్కడి నుండే ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ సినిమాలను చూడడం ప్రారంభించారు ఇతర భాషల్లో. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటుడిగా కూడా ఎంతో పరిణీతి చెందినట్టుగా అందరికీ అనిపించింది. అయితే ఈ సినిమా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఇక అసలు విషయానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన నవదీప్ చిన్నప్పటి క్యారక్టర్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాత్ర పోషించిన కుర్రాడి పేరు అనుదీప్. ఇతను ఇప్పుడు పెద్దవాడే, ఏకంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం లో చేసే రేంజ్ కి వచేసాడు. ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి కొడుకు గా నటించిన వ్యక్తి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటారు.

ప్రీ క్లైమాక్స్ లో ఇతగాడి నిజస్వరూపం తెలిసి సాయి ధరమ్ తేజ్ చితక్కొడుతాడు. అతను మరెవరో కాదు, ఆర్య 2 లో చిన్న నవదీప్ గా నటించిన ఈ కుర్రాడే. పెద్దయ్యాక ఇతగాడు చేసిన మొదటి సినిమా ‘బ్రో ది అవతార్’. భవిష్యత్తులో మరింత గొప్ప రేంజ్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఈ కుర్రాడు (Child Artist) ఏ రేంజ్ లో వెళ్తాడు అనేది .

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus