సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఒక్కొక్కరుగా గుడ్ న్యూస్..లు చెబుతున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ తన ప్రేయసి గురించి చెప్పి.. త్వరలోనే ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు తెలిపి సర్ప్రైజ్ చేశాడు. ఇక అటు తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ మరో ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు మరో స్టార్ సింగర్ కూడా పెళ్లి చేసుకున్నట్టు తెలిపి అందరినీ సర్ప్రైజ్ చేసింది.

Arya Dhayal, Abhishek

వివరాల్లోకి వెళితే.. మలయాళం స్టార్ సింగర్ ఆర్య దయాల్ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆమె ప్రేమించిన అబ్బాయిని సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసింది. అంతేకాకుండా అతన్ని పెళ్లి చేసుకున్నట్టు తెలిపి పెద్ద షాకిచ్చింది. అభిషేక్ అనే వ్యక్తిని చాలా సింపుల్ గా ఈమె పెళ్లి చేసుకుంది. అది కూడా రిజిస్టర్ ఆఫీస్లో కావడం విశేషంగా చెప్పుకోవాలి. తమ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు ఈ నూతన దంపతులు. కొద్దిసేపటికే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. వీళ్ళ ఫాలోవర్స్ ఒక్కసారిగా షాకయ్యి.. తర్వాత ‘కంగ్రాట్స్’ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.

మలయాళం సింగర్ అయినప్పటికీ ఆర్య దయాల్ తెలుగు సినిమాల్లో కూడా పాటలు పాడింది. శ్రీ విష్ణు ‘బ్రోచేవారెవరురా’ ,ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ వంటి సినిమాల్లో సూపర్ హిట్ పాటలు ఆలపించింది. అలాగే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ లో కూడా పాట పట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈమె పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇడ్లీ కొట్టు మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus