2004లో వచ్చిన ‘ఆర్య’ (Aarya) టాలీవుడ్ కు ఓ పాత్ బ్రేకింగ్ మూవీ. హీరో అంటే ఇలాగే ఉండాలి… లవ్ స్టోరీ అంటే ఇలాగే ఉండాలి.. వంటి లెక్కల్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఇది. ఈ సినిమా అల్లు అర్జున్ (Allu Arjun) కి ఓ టర్నింగ్ పాయింట్. అతన్ని హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే. నిర్మాతగా దిల్ రాజుని (Dil Raju) మరో మెట్టు పైకి ఎక్కించింది. సుకుమార్ (Sukumar) వంటి లెక్కల మాస్టారుని టాప్ డైరెక్టర్ ను చేసిన సినిమా కూడా. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్… రత్నవేలు సినిమాటోగ్రఫీ.. అన్నీ చాలా బాగుంటాయి.
పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రతి బయ్యర్ కు 10 రెట్లు లాభాలు పంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఆర్య’ గొప్పలు చాలానే ఉన్నాయి. అయితే కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. అయితే తర్వాత తర్వాత ఆ సినిమాని టీవీల్లో బాగా చూశారు.
ఇక ‘ఆర్య 3’ (Arya 3) ఉంటుందా? అని ఓ సందర్భంలో అల్లు అర్జున్ ను అడిగితే.. ‘నేను సుక్కు కలిసి ఆర్యకి కొనసాగింపుగా కాకుండా దాన్ని మరిపించే సినిమా చేస్తామని’ చెప్పాడు. అలా ‘పుష్ప’(Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) చేశారు. దీంతో ‘ఆర్య 3’ ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ అధినేత దిల్ రాజు ‘ఆర్య 3’ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. ఆ న్యూస్ 2 రోజుల నుండి తెగ వైరల్ అవుతుంది.
ఈ క్రమంలో ‘ఆర్య 3’ (Arya 3) టైటిల్ ఆశిష్ (Ashish Reddy) కోసం రిజిస్టర్ చేయించినట్టు టాక్ కూడా వినిపిస్తోంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆశిష్ ‘రౌడీ బాయ్స్'(Rowdy Boys) ‘లవ్ మీ’ (Love Me) వంటి సినిమాలు చేశారు. ఇందులో ‘రౌడీ బాయ్స్’ పర్వాలేదు అనిపించింది. అలాగే ‘సెల్ఫిష్’ (Selfish) వంటి సినిమాల్లో నటిస్తూ అతను బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతను ‘ఆర్య 3’ లో హీరోగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
‘Arya3’ for ‘Asish’#asish #Arya3 #arya3 #arya #dilraju #Sukumar https://t.co/ae6NzzGzFV pic.twitter.com/WBV316KISi
— Phani Kumar (@phanikumar2809) May 22, 2025