Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్ధి… ముసలోడే కానీ..మహానుభావుడు అంటున్న నెటిజన్లు!

బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పోకిరి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా ఆశిష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. 57 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకొని అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ఆయన అస్సాంకు చెందిన రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పెళ్లిపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

ఈ వయస్సులో రెండో పెళ్లి ఏంటి.. ? ముసలోడు ఏం చేస్తాడు..? ఇలాంటి పని చేసి సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నాడు..? అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. అయితే ఆ విమర్శలకు ఆశిష్ స్పందించాడు. తనపై వస్తున్న విమర్శలన్నింటిని తాను విన్నానని.. పెళ్లి చేసుకోవడం అంటే శారీరక సుఖం కోసమే కాదు అని, ఒక తోడు కోసం చేసుకుంటారని, తనకు అలాంటి తోడు కోసమే తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు.

ఇక పెళ్లి తరువాత ఈ జంట హానీమూన్ లో కనిపించి షాక్ ఇచ్చారు. రూపాలి, ఆశిష్ .. ఇండోనేషియాలోని బాలికి హానీమూన్ కు వెళ్లారు. ఇక తాజాగా హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రూపాలి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చక్కటి లొకేషన్ లో భర్త ఆశిష్ పక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తూ ఆమె కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. (Ashish Vidyarthi) ఆశిష్- రూపాలి జంటను చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంతమంది ట్రోలర్స్ మాత్రం ముసలోడే కానీ, మహానుభావుడు అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆశిష్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus