Ashish Vidyarthi: అశిష్ విద్యార్థి రెండో పెళ్లి గురించి ఆమె అలాంటి కామెంట్లు చేశారా?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన అశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. తన కంటే పదేళ్ల తక్కువ వయస్సున్న మహిళను అశిష్ విద్యార్థి వివాహం చేసుకున్నారు. అయితే అశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య స్పందించడంతో పాటు పాజిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం. తన పెళ్లి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో అశిష్ విద్యార్థి స్పందించి క్లారిటీ ఇచ్చారు. మన జీవితాలు వేరు అని ఒక్కొక్కరిది ఒక్కో వృత్తి అని మనం వేర్వేరు నమ్మకాలతో బ్రతుకుతున్నామని ఆయన తెలిపారు.

మనం ఆలోచించే విధానం కానీ ఎదుర్కొనే ఛాలెంజెస్ కానీ చదువు కానీ బ్యాగ్రౌండ్ కానీ అన్నీ వేరని అశిష్ విద్యార్థి చెప్పుకొచ్చారు. కానీ అందరూ కామన్ గా సంతోషంగా ఉండాలని కోరుకుంటామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. మొదటి భార్య రాజోషికి నాకు 22 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని అశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) వెల్లడించారు. అది అద్భుతంగా జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. మా కొడుకు పేరు అర్థ్ అని వాడి వయస్సు 22 అని అశిష్ విద్యార్థి పేర్కొన్నారు.

మా భవిష్యత్తు ఆలోచనలు వేరేగా ఉండటంతో స్నేహపూర్వకంగా ముందుకు సాగుదాం అని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. నాకు తోడు కావాలని భావించి రూపాలిని పెళ్లి చేసుకున్నానని అశిష్ విద్యార్థి వెల్లడించారు. నా వయస్సు 57 మాత్రమేనని అయినా ప్రేమకు వయస్సులో పని ఏంటని ఆయన తెలిపారు. అశిష్ మొదటి భార్య తన పోస్ట్ లో జీవితం అనే ఫజిల్ లో గందరగోళానికి గురి కావద్దని పేర్కొన్నారు. మరో పోస్ట్ లో నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించడు..

నిన్ను బాధ పెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లడు.. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి అని పేర్కొన్నారు. అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఈ గందరగోళమంతా తుడిచిపెట్టుకుపోతుందని ఆమె అన్నారు. నువ్వు చాలా కాలంగా స్ట్రాంగ్ గా ఉన్నావని ఇప్పుడు అందరి ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. అందుకు నువ్వు పూర్తి అర్హురాలివని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus