Mahesh Babu,Ashok Galla: మహేష్ బాబుతో బీర్ తాగిన హీరో అశోక్ గల్లా!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్తగా పరిచయం అవ్వడానికి సిద్ధంగా ఉన్న హీరో అశోక్ గల్లా. ఓ వైపు పొలిటికల్ సపోర్ట్ మరోవైపు ఘట్టమనేని సూపర్ స్టార్ ఇమేజ్.. ఈ రెండు ఆసరాగా చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మహేష్ మేనల్లుడు సిద్ధమయ్యాడు. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలను ప్రమోషన్ లో బాగానే హైలెట్ చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలలో అశోక్ గల్లా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గానే భయటపెట్టేస్తున్నాడు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ మామ మహేష్ బాబుతో కూర్చొని బీర్ కూడా తగినట్లు చెప్పాడు. తాను 18 ఏళ్లలోకి వచ్చిన అనంతరం ఒక సారి ఇంట్లోనే మహేష్ గారు పక్కన ఉండగానే బీర్ తీసుకొని తాగాను. ఆయన నన్ను అప్పుడు ఒక డిఫరెంట్ లుక్ తో చూశారు. బీర్ తాగుతావా అంటూ అడగడంతో నేను సైలెంట్ గా ఉండి పోయాను అని అశోక్ వివరణ ఇచ్చారు. ఒక విధంగా అశోక్ తన మామయ్యతో చాలా క్లోజ్ గా ఉంటాడని అర్ధమయ్యింది.

అంతే కాకుండా మహేష్ బాబు ఇంట్లో చాలా కూల్ గా అల్లరిగా ఉంటారని ఆయన పిల్లలతో ఉన్నా కూడా వాళ్ళతో ఈజీగా కలిసిపోతారని అన్నారు. అలా విధంగా నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు లాంటి వ్యక్తిని తన జీవితంలో చూడలేదని ఆయనతో కనెక్ట్ అయితే ఎదుటి వారి కూడా చాలా హ్యాపీగా ఉండేలా చేస్తారని అన్నారు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ విషయంలో చాలా క్లోజ్ గా ఉంటారని చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎనర్జిటిక్ గా ఉండేలా సరదాగా ఉంటారని అశోక్ తెలియజేశాడు.

ఇక హీరో సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాతో అశోక్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus