మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా అందరికీ సుపరిచితమే. గత ఏడాది అంటే 2022 లో వచ్చిన ‘హీరో’ సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సినిమాకి టాక్ బాగానే వచ్చినా కానీ.. ఎందుకో బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ మూవీ నిలబడలేదు. అయితే మొదటి సినిమాకే స్టార్ క్యాస్టింగ్ తో పనిచేసే ఛాన్స్ అశోక్ కి దక్కింది.
మొదటి సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో అతను రొమాన్స్ కూడా చేశాడు. ఇక తన రెండో చిత్రానికి అశోక్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. పెద్ద ప్రాజెక్టులు చేయాలనే ఆశ ఇతనికి లేదు.. సాధ్యమైనంత వరకు మంచి కథలు చేయాలని చూస్తున్నాడు. అందుకే బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇందులో 2020లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన మానస వారణాసి ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా మానస, (Ashok Galla) అశోక్ గల్లా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ మొదలైంది. ఇద్దరూ కలిసి ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారట. తాజాగా వీళ్ళు వీళ్ళు కలిసి హైదరాబాద్, మదీనా గూడలోని బాబాయ్ హోటల్ ఓపెనింగ్ కి వెళ్లి అక్కడి కెమెరాలకు చిక్కారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అలాగే వీరి పై వస్తున్న గాసిప్స్ ఇంకా ఎక్కువయ్యాయని స్పష్టమవుతుంది. అశోక్ టీంని అడిగితే అలాంటిదేమి లేదు అంటున్నారు. చూడాలి మరి..!