దర్శకత్వ విభాగంలో పని చేసే కుర్రాళ్లు హీరోలుగా మారడం చూశాం. హీరోలుగా చేసినవాళ్లు తర్వాత దర్శకులు అవ్వడమూ చూశాం. ఈ రెండూ కాకుండా మరో రకం ఉంది. అదే హీరో అయ్యే ముందు కొన్నాళ్లు పరిజ్ఞానం కోసం దర్శకత్వం విభాగంలో పని చేయడం. సినిమా అంటే ఏంటి, 24 క్రాఫ్ట్స్ ఎలా పని చేస్తాయి అనే వివరాలను దగ్గరుండి తెలుసుకోవడానికి కొంతమంది ఇలా చేస్తుంటారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు… మహేష్‌బాబు మేనల్లుడిగా తెరంగేట్రం చేస్తున్న గల్లా అశోక్ కూడా మూడో రకానికి చెందినవాడే.
అవును, అశోక్ గల్లా… ఓ సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ‘హీరో’గా ఎంట్రీ ఇచ్చే ముందు దర్శకత్వ శాఖలో పని చేస్తే బాగుంటుందని మేనమామ మహేష్‌బాబు సూచనతో గల్లా అశోక్ ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశాడట. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు కొరటాల శివతోనే ఉంటూ సినిమా నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలు తెలుసుకున్నాడట గల్లా అశోక్. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు.
అయితే కథ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆ సినిమా ఆపేశారు. ఈ సమయంలో శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడం, డెబ్యూ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉన్నాయి అనిపించడంతో ఓకే చేసేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే సినిమాను జాగ్రత్తగా చిత్రీకరించారు. ఇన్నాళ్లూ ఓటీటీ ఆఫర్లు వస్తున్నా, ఇవ్వకుండా థియేటర్లలో రిలీజ్ చేయడానికి వెయిట్ చేశారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదాతో స్లాట్ దొరికి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.
సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే… అశోక్‌లో ఈజ్ కనిపిస్తోంది. మరి సినిమాలో ఎలా చేశాడు, స్క్రీన్ ప్రజెన్స్ ఎంత బాగుంది అనేది ఇక్కడ కీలకం. కుర్ర హీరోలు ఇప్పుడు డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపేస్తున్నారు. కుర్రాడిలో కలర్, కటౌట్ బాగున్నాయి. వాటికి మంచి డ్యాన్స్, యాక్షన్ సీన్స్ చేసే కేపబిలిటీ ఉంటే… అదరగొట్టేయొచ్చు. చూద్దాం జనవరి 15న ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!