రూమర్లపై అషు, రాహుల్ రియాక్షన్!

సెలబ్రిటీలపై రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి. వీటిపై కొందరు స్పందిస్తుంటారు.. మరికొందరు అసలు పట్టించుకోరు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. నటి అషు రెడ్డితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జంట సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, తరచూ కలిసి పార్టీలకు వెళ్తుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై రాహుల్, అషు రెడ్డి స్పందించారు.

ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్, అషును వారు క్లోజ్ గా దిగిన ఫోటోలను చూపించి ప్రశ్నించగా.. ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయని.. బయటకి వచ్చినవి బచ్చా ఫోటోలంటూ తీసిపారేసింది ఈ జంట. అనంతరం రాహుల్ స్పందిస్తూ.. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో బాగా చిల్ అయ్యేవారెవరంటే రాహుల్, అషు రెడ్డి అని చెప్పుకోవచ్చని.. ఈ క్రమంలో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయని.. అన్ ఫాలో చేసుకోవడాలు.. బ్లాక్ చేయడం ఇలా చాలా ఉంటాయని కానీ తరువాత మళ్లీ కలిసిపోతామని అన్నారు.

ఇక వీరి బంధం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. అషు రెడ్డి.. ‘నేను రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ని.. అంతేకంటే ఎక్కువ కూడా’ అంటూ చెప్పుకొచ్చింది. ‘రాహుల్ అంటే టూ మచ్ లవ్.. ఎనీ టైమ్ అవైలబుల్ లవ్’ అని చెప్పి షాకిచ్చింది. అంతేకాదు.. తన మెడలో ఉన్న AR అనే లాకెట్ ను చూపిస్తూ..A అంటే అషు.. R అంటే రాహుల్ అని చెప్పింది. తమపై వచ్చిన రూమర్లను కావాలనే హైలైట్ చేసుకుంటూ వీరిద్దరూ సమాధానాలు ఇచ్చారు. మరి ఈ రిలేషన్ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus