Ashu Reddy: అషూరెడ్డి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

‘బిగ్ బాస్’ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతలా పాపులర్ అయిన అషూ రెడ్డి… ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ వంటి మూవీలో కూడా నటించింది.అయితే ‘బిగ్ బాస్3’ లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. ఇక హౌస్ నుండీ బయటకి వచ్చాక ‘ ‘బిగ్ బాస్3′ విన్నర్ మరియు సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె ప్రేమలో ఉంది’ అనే వార్తలతో ఈమె మరింతగా పాపులర్ అయ్యింది.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా… సోషల్ మీడియాలో అషూకి సంబంధించిన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఆమె స్నేహితులు ఉంగరం తొడగడంతో అషూ ఎమోషనల్ అయ్యింది. ఇటీవల అషూ స్నేహితులు ఆమెకు గిఫ్ట్‌గా ఓ ఉంగరాన్ని తెచ్చి అషూ వేలికి తొడిగారు. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్ లో పెట్టుకుంది అషూ. ఈ ఉంగరం పై ‘AR’ అనే రక్షరాలు ఉండడం విశేషం.

ఈ విషయం పై అషూరెడ్డి స్పందిస్తూ ‘మీరెప్పుడూ నన్ను ఏదో ఒక రకంగా నన్ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. నాకు కన్నీళ్లు ఆగడం లేదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది.ఆమె స్నేహితులతో అషూకి గల బాండింగ్ అలాంటిదని ఈ విషయంతో స్పష్టమైంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus