Ashu Reddy, Vijay Devarakonda: ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిన అషు రెడ్డి.. వైరల్ అవుతున్న పోస్ట్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీ హోదాలో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో అషు రెడ్డి ఒకరు. ఈమె టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇకపోతే అషు రెడ్డి కొద్దిగా సమంత పోలికలతో ఉండటం వల్ల అందరూ ఈమెను జూనియర్ సమంత అంటూ బాగా పాపులర్ చేశారు. ఇదే పాపులారిటీని అవకాశంగా చేసుకున్న అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుతున్నారు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు షేర్ చేయడమే కాకుండా తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇకపోతే ఇదే పాపులారిటీతో ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన అషు రెడ్డి మధ్యలోనే బయటకు రావడమే కాకుండా బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్స్ వల్ల మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మతో చేస్తున్న బోల్డ్ ఇంటర్వ్యూతో అషు రెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఈమెకు గుర్తుకు రావడంతో ఏకంగా సినిమాలలో హీరోయిన్ అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అషు రెడ్డి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో కాల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ను అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇకపోతే ఈమె విజయ్ దేవరకొండకు ఎందుకు వీడియో కాల్ చేశారు.

.అతనితో ఏం మాట్లాడారు అనే విషయాలను మాత్రం ఎంతో గోప్యంగా ఉంచారు. అయితే ఈమె విజయ్ దేవరకొండకు ఎందుకు వీడియో కాల్ చేశారనే విషయం గురించి ప్రస్తుతం నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus