Ashu Reddy, Akhil: కావాలనే అఖిల్ తో అషూ మాట్లాడటం మానేసిందా..? ఇద్దరి మద్యలో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ ఓటీటీలో ఐదోవారం కెప్టెన్ గా అఖిల్ ఎంపిక అయ్యాడు. తన ఫ్రెండ్స్ కి సాక్రిపైజ్ చేయకుండా చివరి వరకూ పోరాడి మరీ కెప్టెన్సీని మరోవారం ఇమ్యూనిటీని దక్కించుకున్నాడు అఖిల్. అయితే, తన ఫ్రెండ్ అషూరెడ్డి మాత్రం దూరం అయ్యింది. మార్నింగ్ నుంచీ ఇద్దరికీ చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూనే ఉన్నాయి. మొదటి వారం నుంచీ కూడా ఏదో ఒక విషయంలో అషూరెడ్డి అలగడం, లేదా అఖిల్ మూభావంగా ఉండటం అనేది జరుగూతునే ఉంది.

Click Here To Watch NOW

ఇప్పుడు ఏకంగా నాతో మాట్లాడకు, నేను కూడా నీతో మాట్లడను అనే వరకూ వచ్చింది విషయం. ఇద్దరి మద్యలో ప్రెండ్షిప్ కటాఫ్ అయిపోయింది. నిజానికి ఇద్దరూ తీవ్రంగా గొడవ పడాల్సిన అంత సీన్ అయితే ఎక్కడా జరగలేదు. చిన్న చిన్నగానే మాట్లాడుకుంటూ మాజాక్ లో జోకులు వేసుకుంటూ హర్ట్ అయ్యింది అషూ. అఖిల్ సారీ చెప్తూ బ్రతిమిలాడుతున్నా కూాడ సీరియస్ గా అఖిల్ కి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇద్దరి మద్యలో ఏం జరగిందంటే.,

మార్నింగ్ సోఫాలో కూర్చుని మాట్లాడుకునేటపుడు అఖిల్ కి వచ్చిన కల గురించి చెప్పాడు. గేట్ తీసుకుని ఒక అమ్మాయి వస్తున్నట్లుగా కల వచ్చిందని చెప్పాడు. లేడీ గెటప్ లో వస్తున్నారా.. లేదా నిజంగానే అమ్మాయా అని అషూరెడ్డి టీజ్ చేసింది. దీంతో లేడీ గెటప్ లో నువ్వు ఉన్నావ్ గా అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో అషూకి కోపం వచ్చింది. జోక్ గా అన్నా కూడా సీరియస్ గా తీస్కుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కూర్చుని కాసేపు ప్యాచప్ చేసుకున్నారు. అయినా కూడా అఖిల్ జోకులు వేస్తునే ఉన్నాడు.

మరోసారి అలిగి వెళ్లిపోయింది అషూ. ఆ తర్వాత ముమైత్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే అఖిల్ టీజ్ చేసినట్లుగా మాట్లాడాడు అని అక్కడ్నుంచీ వెళ్లిపోయింది అషూ. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత అఖిల్ ని కాసేపు ఏడిపించింది అషూ. నువ్వు కెప్టెన్ అయితే నాకేంటి.. ఎవరికి ఎక్కువ అంటూ మాట్లాడింది. మార్నింగ్ నుంచీ ఇద్దరికీ పడట్లేదు, అందులోనూ కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయలేదు. అషూ స్రవంతికి ఇచ్చేద్దామని చెప్పినా వినలేదు.

దీంతో అషూరెడ్డికి మండింది. నువ్వు నన్ను బ్లాక్ మైయిల్ చేయకు , పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పకు, నువ్వ కెప్టెన్ అయితే నీకే గొప్ప, నాకు కాదు అంటూ సీరియస్ గానే మాట్లాడింది. కానీ, అఖిల్ దీనికి కూడా జోక్స్ వేస్తూ లైట్ తీస్కున్నాడు. అందుకే అషూరెడ్డి స్ట్రిక్ట్ గా నేను నీతో మాట్లాడను అంటూ అకిల్ కి చెప్పింది. ఆ తర్వాత కూడా అఖిల్ ఈ విషయాన్ని సీరియస్ గా తీస్కోలేదు. ముమైత్ ఖాన్ గట్టి గట్టిగా నవ్వేసరికి ఇంకా ఫీల్ అయ్యింది అషూరెడ్డి.

నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ అషూరెడ్డి మజాక్స్ లో అంటూనే సీరియస్ అయ్యింది. అఖిల్ చాలా ఫన్ వేలో ఇది చేసినా ఆ తర్వాత ఇద్దరూ సీరియస్ గా మాట్లాడుకున్నారు. నిజంగా నేను నీతో మాట్లాడాలని లేదు, నువ్వు మార్నింగ్ నుంచీ నన్ను హర్ట్ చేస్తున్నావ్ అంటూ మాట్లాడింది. ఇక హౌస్ లో నుంచీ బయటకి వెళ్లేటపుడే నీతో మాట్లాడతాను అంటూ చెప్పింది. దీంతో ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు. మరి వీళ్లు ఎప్పుడు కలుస్తారు అనేది ఆసక్తికరం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus