Ashu Reddy: అషూరెడ్డి లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో సీనియర్ పార్టిసిపెంట్ గా వచ్చింది అషూరెడ్డి. అంతకుముందు సీజన్ 3లో చేసినా తన ప్రేమ గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దీనికి సంబంధించిన టాస్క్ కూడా తనకి రాలేదు. అయితే, ఈసారి బిగ్ బాస్ గత సీజన్ లో లాగానే హౌస్ మేట్స్ తొలిప్రేమని షేర్ చేసుకోమని చెప్పాడు. దీంతో అషూరెడ్డి తన జీవితంలో ఫస్ట్ లవ్ గురించి ఫస్ట్ టైమ్ చెప్పింది. నేను 20 సంవత్సారాలు ఉన్నప్పుడు ఇద్దరం లవ్ చేసుకున్నాం.

ఇద్దరం కలిసి తిరిగాం. ఇంట్లో తెలిసిపోయింది. హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను కూల్ డ్రింగ్ కంపెనీలో ఇంటర్న్ షిప్ చేసేటపుడు మరోసారి మళ్లీ కలుసుకోవడం ప్రారంభించాం. ఇంట్లో వాళ్లని ఒప్పించే ప్రయత్నం చేశాం. అప్పుడు నేను అతను ఎంబిఎ చదివేందుకు యఎస్ వెళ్లాలని డిసైడ్ అయ్యాం. అక్కడ్నుంచీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. నాకు ఆత్రం ఎక్కువ కదా.. ముందుగానే యుఎస్ వెళ్లిపోయా, కానీ తను మాత్రం రాలేదు. ఎందుకు రాలేదని అడిగా, ఏదో కారణాలు చెప్పాడు. మద్య మద్యలో మాకు గొడవలు జరిగేవి.

మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా అవి తగ్గేవి. మద్యలో తను మా ఇద్దర్నీ కాంప్రమైజ్ చేసేందుకు ట్రై చేసేది. అలా చాలారోజులు గడిచింది. గొడవలు అయిన ప్రతిసారి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయికి షేర్ చేసుకునేదాన్ని. తర్వాత విజిటింగ్ వీసా మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు తెలిసింది. తను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని. ఇక తిరిగి నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత , మా పేరెంట్స్ వాళ్ల పేరెంట్స్ పెళ్లికి రెడీ అయ్యారు. పెళ్లి వరకూ వచ్చేశాం. కానీ, నాకు మాత్రమే తెలుసు తను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని. అందుకే, నేను పెళ్లి వద్దని ఆ బ్లేమ్ ని నామీద వేసుకున్నా.

నిజానికి అతడితో గొడవలు పడేటపుడు చేయి కోసుకోవడం గాట్లు పెట్టుకోవడం కూడా చేశా. కనీసం ఇది చూసి అయినా సరే తను నా దగ్గర ఉండిపోతాడేమో అని అనుకున్నా. కానీ, తను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడు. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనిపించింది. ఈలోగా నాకు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అతనికి పెళ్లి అయిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరాతీస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్ అనే తెలిసింది. మా ఇద్దరి మద్యలో గొడవలు అయినపుడు ఎవరైతే కాంప్రమైజ్ చేస్తూ వచ్చిందో అదే అతడ్ని పెళ్లి చేసుకుంది.

ఇదే మా లవ్ స్టోరీలో ట్విస్ట్ అంటూ చెప్పుకొచ్చింది అషూరెడ్డి. ఎన్ని చేసినా నా దగ్గర మాత్రం అతను లేడు. ప్రతిసారి ఆ అమ్మాయి కలపడానికి ట్రై చేసింది. కానీ, ఒకసారి బ్రేకప్ అయిపో అని చెప్పింది. ఇక్కడే అరియానా అషూ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావా అని అడిగితే నేను మాట్లాడట్లేదు అంటూ చెప్పింది. నేను డిప్రెషన్ లోకి వెళ్లి, చాలా త్వరగా బయటపడ్డాను. అప్పట్నుంచీ ఎవరితో రిలేషన్ షిప్ లేదు. నో ఎమోషనల్, నో లవ్ అంటూ చాలా ఈజీగా చెప్పింది అషూ. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus