Ashu Reddy: నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటున్న అషురెడ్డి… తల్లి షాకింగ్ రియాక్షన్… వీడియో వైరల్..!

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ నిర్మాణంలో నితిన్ హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అషురెడ్డి. ఆ చిత్రంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఫ్రెండ్ గా నటించింది. కాకపోతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో అషుకి ఎటువంటి గుర్తింపు దక్కలేదు. తర్వాత జూనియర్ సమంత మాదిరి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది.అలా సంపాదించుకున్న క్రేజ్ తో ‘బిగ్ బాస్3’ లో అవకాశాన్ని దక్కించుకుంది.

హౌస్ లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏర్పడ్డ ఫ్రెండ్ షిప్ తో.. షో ముగిసాక విచ్చలవిడిగా అతనితో తిరిగింది. ఓ దశలో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఆ వార్తలని వీళ్ళు కొట్టిపడేసారు. ఇదిలా ఉండగా.. తాజాగా అషు… ‘తాను ప్రెగ్నెంట్ అంటూ వాళ్ళ అమ్మ మరియు ఫ్యామిలీ ముందు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? అంటూ ఆమె తల్లిని అడుగగా ఇంకేముంది ఏమైనా తాగి చచ్చిపోదాం అంటూ ఎమోషనల్ అయ్యి ఆషు రెడ్డి పై చెయ్యి చేసుకుంది.

అటు తరువాత ‘ఉండు మీ నాన్న గారికి ఫోన్ చేస్తాను’ అంటూ ఆషు తల్లి ఫోన్ తీయగా.. ‘ఆగమ్మా ఇదంతా ప్రాంక్ కావాలంటే కెమెరా చూడు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది’. దాంతో అషు తల్లి ‘నువ్వు ప్రాంక్ అని చెప్పినా నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. నీ పై నాకు నమ్మకం ఉంది. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడు చెయ్యకు’ అంటూ మందలించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus