శివని చెప్పుతో కొట్టిన అషూ..!

బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడేందుకు నలుగురు ఇంటి సభ్యులు అర్హతని సాధించారు. ఇందులో అనిల్, అఖిల్, బిందుమాధవి ఇంకా బాబామాస్టర్ ఉన్నారు. ఈనలుగురులో ఎవరు ఈపాస్ ని సాధిస్తారు అనేది ఆసక్తికరం. లాస్ట్ సీజన్ లో ఈపాస్ ని కాజల్ సన్నీకి వచ్చేలా చేసింది. అలాగే, సన్నీ లాస్ట్ మినిట్ లో కాజల్ ని సేఫ్ చేశాడు. ఆ వారం అనూహ్యంగా రవి ఇంటి నుంచీ వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా అలాంటి ట్విస్ట్ ఏదైనా బిగ్ బాస్ వీకెండ్ ప్లాన్ చేసాడా అని హౌస్ మేట్స్ డిస్కషన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా అరియానా వీకండ్ ఏదో ట్వి్స్ట్ ఉండబోతోంది అంటూ మాట్లాడింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అంటూ గెస్ వర్క్ చేసింది. రాత్రి పూట శివతో కలిసి చాలాసేపు మాట్లాడిన అరియానా ఆ తర్వాత హౌస్ మేట్స్ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫన్ చేశారు. గజ్జెల సౌండ్ చెవి దగ్గర చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఫస్ట్ బాబాభాస్కర్ లేచి నిజంగా భయపడ్డానంటూ లైట్ తీస్కుని పడుకున్నాడు. ఆ తర్వాత అషూని అరియానా డిస్టర్బ్ చేసింది. శివ పక్కనే ఉండి సపోర్ట్ చేశాడు. నిద్ర లేచిన అషూ తన చెప్పు తీసుకుని శివ వెంట పడింది. దీంతో శివ పరిగెడుతూ బెడ్ పైన దుప్పటి కప్పుకుని కూర్చున్నాడు. అక్కడే చెప్పుతో చెడా మడా కొట్టేసింది అషూ. పక్కనే అరియానా చెప్పు వద్దులే అషూ అని చెప్తున్నా కూడా అషూ వినిపించుకోలేదు. ఫన్నీగానే చేసినా కూడా అషూ మాత్రం చెప్పుతో శివని కొట్టడం అనేది అరియానాకి నచ్చలేదు. అలాగే, ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
సరదాగా హౌస్ మేట్స్ అర్ధరాత్రి నిద్రని డిస్టర్బ్ చేస్కుని మరీ దీన్ని గేమ్ లాగా ఆడారు. నటరాజ్ మాస్టర్ ని సైతం డిస్టర్బ్ చేస్తే, ఆయన సడెన్ గా లేచి అపరిచుడిలా వెంటబట్టాడు. దీంతో అరియానా, అషూ ఇద్దరూ కూడా భయపడి దాక్కున్నారు. చాలాసేపు మాస్టర్ ఫన్ చేశారు. నేను నేర్పిన ఆట నాతోనే ఆడతారు అంటూ ఫన్ చేశారు.
అఖిల్, బాబామాస్టర్, అనిల్ ముగ్గురూ కూడా మాస్టర్ వెళ్తుంటే బాగా ఎంజాయ్ చేశారు. అర్దరాత్రి మొదలైన ఈ ఆట మరి మార్నింగ్ ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అనేది చూడాలి. అలాగే, ఈవారం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus