ఎక్స్ ప్రెస్ హరితో అషు రెడ్డి వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు.సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నటువంటి అషు రెడ్డి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సింగర్ రాహుల్ తో కలిసి పెద్ద ఎత్తున ప్రేమ ప్రయాణం కొనసాగించారు.

దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. కట్ చేస్తే బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత కామెడీ స్టార్స్ లో పాల్గొన్నటువంటి ఈమె అక్కడ కమెడియన్ హరితో పులిహోర కలిపారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు అదేవిధంగా హరి సైతం తన గుండెల పై అషు రెడ్డి పేరును టాటూ గా వేయించుకోవడమే కాకుండా ఈమె కూడా తనకు ఖరీదైన బైక్ బహుమతిగా అందించారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా తాజాగా వాలంటైన్స్ డే ను పురస్కరించుకొని వీరిద్దరూ సెలబ్రేట్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హరి అషు రెడ్డి ఇద్దరు కలిసి తమ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ ను హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే ఆర్ఫాన్ హోమ్ కివెళ్లి అక్కడ ఉన్నటువంటి చిన్నారుల మధ్యన కేక్ కట్ చేసి వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

ఇక ఈ ఫోటోలను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మన వద్ద అపరిమితమైన ప్రేమ ఉన్నప్పుడు అది లేని వారికి పంచాలి అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus