Ashwini: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి ? నాగార్జున ప్రశాంత్ కి ఎందుకు క్లాస్ పీకాడంటే.,

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలిసి మరీ ఎందుకు సెల్ఫ్ నామినేట్ అయ్యావంటూ అశ్వినికి ఫుల్ క్లాస్ పీకారు కింగ్ నాగార్జున. అంతేకాదు, ఇక్కడే పల్లవి ప్రశాంత్ ఆటలో చనిపోయి దెయ్యం అయిన తర్వాత అశ్వినితో ఎందుకు బూతులు మాట్లాడావ్ అంటూ అడిగారు. దానికి పల్లవి ప్రశాంత్ మౌనంగా ఉండిపోయాడు. అయితే, అసలు పల్లవి ప్రశాంత్ మాట్లాడు ప్రశాంత్, నామినేషన్స్ అప్పుడు రొమ్ము విరుచుకుని మాట్లాడతావ్ కదా అంటూ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు.

అసలు ఇంతకీ పల్లవి ప్రశాంత్ అన్న మాట ఏంటంటే., బిగ్ బాస్ హౌస్ లో మర్డర్ టాస్క్ జరుగుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్ ముందుగా అవుట్ అయ్యి ఘోస్ట్ గా మారాడు. ఆ తర్వాత అశ్విని ఇంకా గౌతమ్ ఇద్దరూ కూడా చనిపోయి ఘోస్ట్ లు అయ్యారు. అక్కడ పల్లవి ప్రశాంత్ అశ్వినితో కామపిశాచిలాగా ఉన్నావ్ అంటూ మాట్లాడాడు. దీనికి గౌతమ్ వెంటనే రియాక్ట్ అయి అలా అనకూడదన్నట్లుగా చెప్పాడు. అశ్విని కూడా రెచ్చిపోయి మరీ క్లాస్ పీకింది.

ఇదే విషయాన్ని నాగార్జున వీకండ్ ప్రశాంత్ ని నిలదీసి మరీ అడిగారు. దీనికి పల్లవి ప్రశాంత్ సారీ చెప్పాడు. అంతేకాదు, తను కావాలని అలా అనలేదని చెప్పాడు. దీంతో నాగార్జున ఫన్నీగా అయితే అన్నీ నడిచిపోతాయ్, కానీ అవతల వాళ్లు ఫన్నీగా తీస్కోలేదు. అందుకే, అశ్విని ఫీల్ అయ్యిందని చెప్పాడు. అందుకే, ఇబ్బంది కలుగుతుందని క్లాస్ పీకాడు.దీని తర్వాత డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేస్కుంటావా అంటూ నాగార్జున (Ashwini) అశ్వినికి క్లాస్ పీకారు.

కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా ? అని అడుగుతూ, మనం చేసే పొరపాట్లే వాటి మూలంగానే మనం బలైపోతామ్ అంటూ చెప్పారు. ఇక నాగార్జున చెప్పినట్లుగానే హౌస్ లో అశ్విని ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, చివర్లో అర్జున్ – రతిక ఇద్దరినీ పెట్టి పల్లవి ప్రశాంత్ ని ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడమని చెప్పినట్లుగా సమాచారం. అయితే, వీరిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ అర్జున్ ని పంపించాడా ? లేదా రతికని పంపించాడా అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus