రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ అశ్మీ ‘. ‘సాచి క్రియేషన్స్’ బ్యానర్ పై స్నేహా రాకేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రూపొందింది. థ్లిలర్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుందని చిత్ర బృందం ఆల్రెడీ తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈ మధ్యనే విడుదల చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.సెప్టెంబర్ 3న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హీరోయిన్ రుషికా రాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఫిల్మీ ఫోకస్ తో పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం :
ప్ర. తెలుగులో మీకు ఇదే మొదటి సినిమా కదా?
జ. అవునండీ.. నేను బెంగుళూరుకి చెందిన నటిని. పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే.. అలాగే కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించాను. మాది చాలా చిన్న ఫ్యామిలీ. మా మమ్మీ,డాడీ, నేను, తమ్ముడు.
ప్ర. మీది ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీనా?
జ. కాదండీ.. నాకు ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేదు.6 ఏళ్ళు అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను.ముందుగా నేను మోడలింగ్ చేశాను. చిన్న చిన్న ఈవెంట్ లలో పాల్గొంటూ ఉండేదాన్ని.అలా ఓ ఈవెంట్ కు చెందిన ఒకసారి ఓ మేనేజర్ మురళీ కృష్ణగారి ద్వారా నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
ప్ర. తెలుగు బాగా మాట్లాడుతున్నారు?
జ. నేర్చుకున్నాను అండీ… నా స్నేహితుల ద్వారా నేర్చుకున్నాను. కరెక్టో.. కాదో తెలీకుండానే మాట్లాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నా అని అంతా అంటున్నారు.
ప్ర.’అశ్మీ’ లో అవకాశం ఎలా వచ్చింది?
జ. రాజా నరేంద్ర నాకు మ్యూచువల్ ఫ్రెండ్. ఆయన ద్వారా నాకు ఈ సినిమాలో లీడ్ రోల్ అవకాశం వచ్చింది.
ప్ర. ‘అశ్మీ’ థీమ్ ఏంటి?
జ. ‘అశ్మీ’ అంటే సంస్కృతం వర్డ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విమెన్… అనేది దాని మీనింగ్. సమాజంలో మహిళలు చాలా రకాల వేధింపులకు గురవుతున్నారు. వాటి గురించి కొంతమంది చెప్పుకుంటున్నారు. మరికొంతమంది భయపడి చెప్పుకోవడం లేదు. వాళ్ళలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే థీమ్ తో ఈ మూవీ తెరకెక్కింది.
ప్ర.ట్రైలర్ లో కొన్ని బోల్డ్ అంశాలు కూడా ఉన్నాయి. సినిమా కూడా అలాగే ఉంటుందా?
జ. బోల్డ్ అంశాలు ఉన్నాయి. ఈ మూవీ సబ్జెక్టుకి అది అవసరం. అందుకోసమే చేశాను. అలా అని సినిమా అంతా అలా ఉండదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ప్ర.ఈ మూవీ మీ కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు?
జ.అందరు హీరోయిన్లు చేసే రెగ్యులర్ పాత్ర కాదు ఇది.దర్శకుడు శేష్ కార్తీకేయ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఇలాంటి పవర్ఫుల్ రోల్ నాకు మళ్ళీ దొరుకుతుందా? అనే ఉద్దేశంతో ధైర్యంగా ఈ మూవీ చేయడానికి రెడీ అయ్యాను.
ప్ర.ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా ఈ మూవీ ఉందనుకుంటున్నారా?
జ. మా సినిమాకి సెన్సార్ వాళ్ళు యు/ఎ సెర్టిఫికెట్ ఇచ్చారు. బోల్డ్ అంశాలు ఉన్నప్పటికీ.. అవి వల్గర్ గా ఉండవు. నిజానికి ఈ మూవీని ఓటిటి కోసమే తీశారు. కానీ సినిమా బాగా వచ్చింది. ప్రతీ ఒక్కరిలో రెస్పాన్సిబిలిటీని నింపే మూవీ ఇది. అందరూ చూడాలి.
ప్ర. తెలుగు సినిమాలు చూస్తుంటారా? మీకు ఇష్టమైన హీరో ఎవరు?
జ.అందరు హీరోలు ఇష్టమే కానీ.. ప్రభాస్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం.
ప్ర. అలాగే మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు?
జ. అనుష్క అంటే నాకు చాల ఇష్టం. నాకు హీరోయిన్ అవ్వడానికి స్ఫూర్తి ఆమెనే..! నేను కూడా హైట్ గా ఉంటాను కాబట్టి.. హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేయాలని ఆశపడుతున్నాను.
ప్ర.మీ డ్రీం రోల్ ఏంటి?
జ.నాకు పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలని ఉంది. నాకు దేవుడి పై నమ్మకం బాగా ఎక్కువ. నేను చాలా స్పిరిట్యువల్ కాబట్టి… డివోషనల్ మూవీస్ లో అమ్మవారి పాత్రలు చేయాలని కూడా ఆశగా ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!