Venu Swamy: నేను ఏమీ భగవంతుడిని కాదు.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామిపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఏపీకి సీఎం అయ్యే వ్యక్తి విషయంలో వేణుస్వామి అంచనాలు తప్పడంతో చాలామంది ఆయనపై విమర్శలు చేశారు. వేణుస్వామి సైతం తన జాతకం తప్పైందని అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ట్రోల్స్ వల్ల తనకు డిమాండ్ పెరిగిందని వేణుస్వామి చెబుతుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని వేణుస్వామి పేర్కొన్నారు.

నాకు ట్రోలింగ్ కొత్త కాదని నేనేం భగవంతుడిని కాదని ఆయన అన్నారు. నేను చెప్పిన వాటిలో నూటికి 98, 99 జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ ఫలితాలను సైతం తాను అంగీకరించడం జరిగిందని వేణుస్వామి పేర్కొన్నారు. ప్లేట్ ఫిరాయించే స్వామీజీలను సైతం మీరు చూస్తూనే ఉన్నారని వేణుస్వామి వెల్లడించారు. చాలామంది భయంతో మాటలు మారుస్తున్న సందర్భాలు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేణుస్వామి అలాంటి వాడు కాదని వేణుస్వామికి ధైర్యం ఉందని ఆయన అన్నారు.

నా సబ్జెక్ట్ విషయంలో నాకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారో చేసుకోండని నేను చెప్పిన వాటిలో జగన్ పార్టీ గెలుపు తప్ప అన్నీ జరిగాయని వేణుస్వామి వెల్లడించడం గమనార్హం. ఇది నా సక్సెస్ రేటు అని నేను భయపడే సమస్యే లేదని వేణుస్వామి పేర్కొన్నారు. నేను హైదరాబాద్ లోనే పూజా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు. ట్రోలర్స్, మీమర్స్ వల్ల ఎంక్వైరీలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

ట్రోలర్స్ , మీమర్స్, విమర్శకులకు అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నానని వేణుస్వామి వెల్లడించారు. నేను లక్ష కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణుస్వామి అనే స్థాయికి నేను తీసుకొచ్చానని ఆయన తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus