Adipurush: ఆదిపురుష్ సినిమా గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలిచారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈయన తరచూ సెలబ్రిటీల జాతకాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ వ్యాఖ్యలు కూడా నిజం అవడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది. ఇలా ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇకపోతే తాజాగా వేణు స్వామి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభాస్ తాజాగా నటిస్తున్న (Adipurush) ఆది పురుష్ సినిమా గురించి ఈయన మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ఈ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల గురించి వేణు స్వామి మాట్లాడుతూ అందరూ ఊహించిన విధంగా ఈ సినిమా సక్సెస్ సాధించలేదని ఈయన తెలియజేశారు.

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందలేదని మీడియం రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుంది అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి ఆది పురుష్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా వేణు స్వామి ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో కొందరు ప్రభాస్ అభిమానులు ఈయన వ్యాఖ్యలను కొట్టి పారేయగా మరి కొందరు ఇతను చెప్పినవి ఇదివరకు అన్ని జరిగాయి బహుశా అలాగే జరుగుతుందేమోనని కంగారు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్టర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ జంటగా నటించారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus