టాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అశ్వనీదత్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా ఒక ఇంటర్య్వూలో అశ్వనీదత్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ను ఎప్పటికీ దైవంగానే భావిస్తానని వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎదురులేని మనిషి, యుగపురుషుడు సినిమాలు చేశానని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. యుగపురుషుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.
బీటెక్ నాకు అంతగా ఇష్టం ఉండేది కాదని అశ్వనీదత్ వెల్లడించారు. నాన్న బీటెక్ చేయాలని పట్టుబట్టడంతో ఇంజనీరింగ్ లో చేరానని ఫస్ట్ సెమిస్టర్ తర్వాత అనారోగ్యం బారిన పడ్డానని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. నా కూతురు స్వప్నను అమెరికాలోనే ఉండమన్నానని కానీ ఇండస్ట్రీ వైపు వచ్చిందని అశ్వనీదత్ కామెంట్లు చేశారు. నాగ్ అశ్విన్ డాక్టర్స్ కుటుంబం నుంచి వచ్చాడని వాళ్ల ఫ్యామిలీలో 50 మంది డాక్టర్లు ఉంటే నాగ్ అశ్విన్ ఒక్కడే బీటెక్ చదివి ఇండస్ట్రీలోకి వచ్చాడని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.
అన్ని బ్యానర్లలో 70 సినిమాలు చేశానని అశ్వనీదత్ కామెంట్లు చేశారు. నేను జాతకాలను బాగా నమ్ముతానని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. చిరంజీవి క్రమశిక్షణకు మారుపేరని ఆయనే ఇండస్ట్రీని నడిపిస్తున్నారని అశ్వనీదత్ కామెంట్లు చేశారు. బాలయ్య, నాగార్జున పెద్ద హీరోల కొడుకులైనా అలా ఎప్పుడూ ప్రవర్తించలేదని అశ్వనీదత్ అన్నారు. హీరో వెంకటేశ్ లో పెద్ద నిర్మాత కొడుకుననే గర్వం అస్సలు ఉండదని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమాను ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదన్న గర్వంతో చేస్తున్నామని అశ్వనీదత్ అన్నారు.
కథ విన్న సమయంలో శక్తి మూవీ బాగానే అనిపించిందని ఆయన తెలిపారు. శక్తి సినిమా విడుదలైన నెలరోజులకే నాన్నగారు చనిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. సీతారామం సినిమాకు భారీ బడ్జెట్ అయిందని అనిపించిందని అయితే కథను నమ్మి ఈ సినిమా తీశామని అశ్వనీదత్ కామెంట్లు చేశారు. సీతారామం హీరోయిన్ ఎవరో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియదని దుల్కర్ మహానటిలో నెగిటివ్ రోల్ లో నటించాడని అయినప్పటికీ సీతారామం సినిమాను ప్రేక్షకులు ఆదరించారని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?