‘అశ్వద్ధామ’ టీజర్ రివ్యూ!

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2020 జనవరి 31న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ సింగిల్ తో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాల్ని రెట్టింపు చేసేలా ఈరోజు ‘అశ్వద్ధామ’ టీజర్ ను కూడా విడుదల చేశారు. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఈ టీజర్ ను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఇక ఆ టీజర్ ఎలా ఉందో.. ఓ లుక్కేద్దాం రండి.

‘ఎలా ఉంటాడో కూడా తెలియని ఓ రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం.. సైరన్ కూతలు కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలి అంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి. ఒక అశ్వద్దాముడు రావాలి’ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో హీరో నాగశౌర్య ఎంట్రీ ఇస్తాడు. వైజాగ్ సముద్రాన్ని పోర్ట్ ఏరియాని మరియు విలన్ గ్యాంగ్ అంబులెన్సు లో ప్రయాణిస్తున్న సందర్భాన్ని కూడా టీజర్ లో చూపించారు. ఫుల్ యాక్షన్ మరియు సస్పెన్సు ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందినట్టు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ టీజర్ క్యూరియాసిటీ పెంచేసి సినిమా పై అంచనాల్ని కూడా పెంచేసిందనే చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus