Prabhas: సాకులు చెప్పకుండా దూసుకుపోతున్న ప్రభాస్..!

సినిమాల విషయంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి… రెండేళ్లకు ఒకటి అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు.దానికి కారణం ఏంటి అంటే.. స్క్రిప్ట్ లు వర్కౌట్ అవ్వడం లేదు అంటూ సాకులు చెబుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు రాజమౌళి వంటి దర్శకుడితో సినిమా చేస్తే పర్వాలేదు. అతని పనితనం తెలిసిందే కాబట్టి.. ఆలస్యం అవ్వడంలో వింత లేదు. అంతేకాదు అది వర్త్ వెయిట్ అని కూడా అంతా భావిస్తారు. ఇదిలా ఉండగా… మిగిలిన స్టార్ హీరోల్లా ప్రభాస్ సాకులు చెప్పడం లేదు.

కరోనాని కూడా లెక్క చేయకుండా షూటింగ్ లలో పాల్గొన్నాడు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కనుక లేకపోతే ఈ పాటికి ‘రాధే శ్యామ్’ సినిమా కూడా విడుదలయ్యేలా చేసేవాడు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 4 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది.మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ చిత్రం షూటింగ్ ను ఆల్రెడీ 30 శాతం ఫినిష్ చేశాడు.

ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ కూడా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టుని కూడా మొదలు పెట్టేసాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దీపికా పదుకొనె ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే 2022 ముగిసే లోపే ప్రభాస్ నటిస్తున్న 4 లో 3 సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయన్న మాట. మరి చూడాలి ఇందులో ఎన్ని హిట్ అవుతాయో..!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus