కన్నడ సినిమాల్లో కూడా మంచి కంటెంట్ ఉంటుందని ‘కె.జి.ఎఫ్’ చిత్రం నిరూపించింది.ఈ చిత్రం వల్ల కన్నడ సినీ పరిశ్రమ కూడా తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని భావించారు అనుకుంట… పైగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన మాజీ ప్రియుడు.. అందులోనూ కన్నడంలో క్రేజ్ ఉన్న హీరో కాబట్టి రక్షిత్ శెట్టి నటించిన ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు.తెలుగులో ఫెయిల్ అయిన హీరోయిన్ శాన్వి శ్రీవత్సా ఈ చిత్రంలో నటించింది.
కన్నడం లో 2019 డిసెంబర్ చివరి వారంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో మాత్రం జనవరి 1న విడుదలైంది. తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో .. సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి షోకే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మంచి ఓపెనింగ్స్ ను రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల(కరెక్టడ్) వరకూ బిజినెస్ చేసిందని ట్రేడ్ పండితుల సమాచారం.
ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 1.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినా తరువాత చతికిల పడిపోయిందని చెప్పాలి. మొత్తంగా 0.78 కోట్ల వరకూ బయ్యర్స్ కు నష్టాల్ని మిగిల్చింది. ఓపెనింగ్స్ ను బట్టి చూస్తే ‘కె.జి.ఎఫ్’ లాగా ఈ చిత్రం కూడా పుంజుకుంటుందేమో అనుకుంటే.. ఆ రేంజ్లో కలెక్ట్ చెయ్యలేకపోయింది.