Athadu Collections: క్లాసిక్ ‘అతడు’ కి 19 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ‘అతడు’ (Athadu) . ‘జయభేరి ఆర్ట్స్’ బ్యానర్ పై డి.కిషోర్ (D. Kishore) , ఎం.రామ్ మోహన్ (Ram Mohan) లు కలిసి నిర్మించగా మురళీ మోహన్ (Murali Mohan) సమర్పకులుగా వ్యవహరించారు. త్రిష (Trisha) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 2005 వ ఆగస్టు 10న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్లో పాయిజన్ మాదిరి ఈ సినిమా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

Athadu

205 కేంద్రాల్లో 50 రోజులు, 37 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఘనత ‘అతడు’ సొంతం. ‘పోకిరి’ (Pokiri) రేంజ్ సక్సెస్ మహేష్ కి దక్కడానికి పునాది వేసింది ‘అతడు’ సినిమా అని చెప్పవచ్చు. కానీ దాన్ని మించి సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. ఇప్పటికీ ‘అతడు’ ని ప్రేక్షకులు టీవీల్లో చూస్తూనే ఉంటారు. అలాంటి సినిమా రిలీజ్ అయ్యి నేటితో 19 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 5.65 cr
సీడెడ్ 2.40 cr
ఉత్తరాంధ్ర 1.40 cr
ఈస్ట్ 1.10 cr
వెస్ట్ 1.03 cr
గుంటూరు 1.35 cr
కృష్ణా 1.22 cr
నెల్లూరు 0.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  2.40 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.30 cr

‘అతడు’ చిత్రం రూ.16.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో ఈ సినిమా రూ.17.3 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. నిర్మాతలకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి లాభాలు అందించింది.

రీ రిలీజ్లో ఆల్ టైం రికార్డు కొట్టిన ‘మురారి'(4K)

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus