అతల కుతల పాతాళం… పేరు చదవగానే .. ఏంటి ఈ షార్ట్ ఫిల్మ్ .. పేరు కొత్తగా ఉందే ? కథ ఏమై ఉంటుంది ? అని కొన్ని క్షణాల పాటు ఎవరైనా ఆలోచించక మానరు. అవును నేటి కాలంలో ఇలాంటి పేరుని షార్ట్ ఫిలిం కి పెట్టడం సాహసమే. షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇలాంటి విభిన్న కథను ఎంచుకోవడం మరింత సాహసమని అందరూ అంగీకరిస్తారు. ఇప్పటి జనరేషన్ ప్రతిభావంతులు లఘుచిత్రాలను సరదా కోసం తీయడం లేదని ఒప్పుకుంటారు. ముప్పై నిమిషాల నిడివిగల ఈ మూవీ ఎఫెక్ట్ చూసిన ప్రతిఒక్కరికీపై కనీసం ముప్పై రోజులు వరకు ఉంటుంది. శ్రవణ్ పండ్రంగి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ లో శ్రీమాన్ కెమెరా పనితనం, వెంకట్ ఎడిటింగ్, అరుణ్ సంగీతం సమపాళ్లలో కలిసి మధురమైన అనుభూతిని అందించింది.
ఈ కథ, నటుల పనితనం గురించి చెబితే ఆ ఫీల్ ని మీరు మిస్ అవుతారు. అందుకే ఇందులోని ఓ వాక్యాన్ని రాస్తున్నాను.. “నిత్యం సుడిగుండం.. సమయంతో సమరం.. చేసే సాగర మధనం. నిన్నే నువ్వు శోధించుకుంటూ.. నిన్నే నువ్వు సాధించుకుంటూ.. నిన్నే నువ్వు శాసించుకుంటూ… నీకై నిన్ను గెలిపించుకుంటూ.. సాగిపో.. సాగిపో.. సాగిపో..”.. ఈ వాక్యం మాదిరిగానే అతల కుతల పాతాళం ఓ కావ్యం లా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.