ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్ గా పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ‘శ్రీనివాస సినీ క్రియేషన్స్’ పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 7న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో ఆది నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆది నటించిన కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా తెలియని పరిస్థితి.
అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొడతాను అంటూ ‘అతిథి దేవో భవ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు ఆది. రెండు పాటలు హిట్ అయ్యాయి. ప్రోమోస్ కూడా బాగానే అనిపించాయి. దాంతో ఈ చిత్రానికి ఓ మోస్తారు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను పరిశీలిస్తే :
నైజాం | 0.52 cr |
సీడెడ్ | 0.28 cr |
ఆంధ్రా(టోటల్) | 0.46 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 1.26 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.05 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.31 cr |
‘అతిథి దేవో భవ’ చిత్రానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చాలా వరకు ఈ చిత్రం నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ టార్గెట్ ను ఈ చిత్రం రీచ్ అవుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఆది గత సినిమాలు కనీసం రూ.0.75 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. మరి ఈసారి సంక్రాంతి సీజన్ ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి..!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!