Atlee: కొత్త సినిమా కోసం అట్లీ భారీ ప్లానింగ్‌.. బన్నీకి వర్కవుట్‌ కాని కథతోనేనా?

‘జవాన్‌’ (Jawan) సినిమా తర్వాత దర్శకుడు అట్లీ (Atlee Kumar) చేయబోయే సినిమా ఏంటి? గత కొన్ని నెలలుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. మధ్య మధ్యలో కొంతమంది పేర్లు వినిపించినా.. ఆ సినిమాలేవీ ఫైనల్‌ కాలేదు. ఇదిగో అదిగో అంటూ అప్‌డేట్స్‌ కోసం వెయిట్‌ చేసిన ఫ్యాన్స్‌.. ఇప్పుడు ఆ విషయమే మరచిపోయారు. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు చూద్దాం అని ఊరుకున్నారు. ఈ క్రమంలో అట్లీ కొత్త సినిమా అప్‌డేట్ తెలుస్తోంది.

Atlee

పాత సినిమా కథల్ని.. నేటితరానికి తగ్గట్టు మలిచి అందించడంలో అట్లీని కొట్టేవారే లేరు. అందుకే ఆయన చేసిన సినిమాలు అన్నీ హిట్టే. ఆ హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌లగా కూడా నిలుస్తుంటాయి. అలాగే అన్ని సినిమాల కథలూ ఎక్కడో గతంలో చూశాం అని అనిపిస్తుంటాయి. అందుకే అట్లీ నెక్స్ట్‌ సినిమా ఏంటి? అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. పెద్ద హిట్‌ అందుకునే ఆ హీరో ఎవరు అని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో అట్లీ చేయబోయే సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు స్టార్‌ హీరోలు ఉంటారు అని లేటెస్ట్‌ సమాచారం. A6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా పనులు మొదలయ్యాయట. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధాన పాత్రధారి అని చెబుతున్నారు. అలాగే కమల్‌ హాసన్ (Kamal Haasan) ఓ కీలక పాత్రలో నటిస్తాడు అని కూడా అంటున్నారు. మరికొందరు అయితే మల్టీస్టారర్‌ అని కూడా అంటున్నారు.

డిసెంబరులో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది అని చెప్పొచ్చు. నిజానికి ‘జవాన్‌’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) – అట్లీ కలసి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరి మధ్య పలు దఫాలుగా కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్‌ ఊసు లేదు. మరిప్పుడు సల్మాన్‌కి చెప్పిన కథ ఏంటో?

17 ఏళ్ళ ‘హ్యాపీ డేస్’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus