దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించే సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఉండదు. సీన్స్ అన్నీ చాలా నేచురల్ గా, సున్నితంగా అనిపిస్తాయి. ‘ఆనంద్’ (Anand) నుండి ‘లవ్ స్టోరీ’ (Love Story) వరకు ఆయన సినిమాలు అదే ఫీలింగ్ ను కలిగిస్తాయి. అయితే శేఖర్ కమ్ముల సినిమాలకి మార్కెట్ ఏర్పడేలా చేసిన సినిమా అంటే కచ్చితంగా అది ‘హ్యాపీ డేస్’ (Happy Days) అనే చెప్పాలి. 2007 వ సంవత్సరం అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా హడావిడి లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బి.టెక్ లైఫ్ ను రెండున్నర గంటల్లో చాలా అందంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా వల్లే నిఖిల్ (Nikhil Siddhartha), వరుణ్ సందేశ్ (Varun Sandesh), తమన్నా (Tamannaah Bhatia) వంటి వారు స్టార్లుగా ఎదిగారు. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ‘హ్యాపీ డేస్’ (Happy Days) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.57 cr |
సీడెడ్ | 2.93 cr |
ఉత్తరాంధ్ర | 1.82 cr |
ఈస్ట్ | 1.42 cr |
వెస్ట్ | 0.93 cr |
గుంటూరు | 0.98 cr |
కృష్ణా | 1.05 cr |
నెల్లూరు | 0.77 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.47cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.12 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.59 cr |
‘హ్యాపీ డేస్’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఏకంగా రూ.18.59 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి రూ.13.59 కోట్ల భారీ లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.