కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అట్లీ ఒకరు కెరియర్ మొదట్లో ఈయన పలు షార్ట్ ఫిలిమ్స్ చేసేవారు. ఈయన చేసినటువంటి షార్ట్ ఫిలిం ఎంతో సక్సెస్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ శంకర్ తన వద్ద ఈయనని అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఇలా రోబో సినిమాకు గాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి అట్లీ అనంతరం రాజారాణి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
అయితే ఈయన చేసిన ఐదు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. తాజాగా అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి డైరెక్టర్ అట్లీ తన గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన తెలుగు కుటుంబానికి చెందినటువంటి కృష్ణకుమారి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
అయితే వీరి వివాహం తర్వాత తమ జంట గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి అంటూ అట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు. కృష్ణకుమారితో తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
కాకి ముక్కుకు దొండ పండు అంటూ తన గురించి విమర్శలు చేశారని అయితే వాటి గురించి తాను ఏమాత్రం పట్టించుకోలేదు అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ తనపై వచ్చినటువంటి ట్రోల్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.