Atlee, Shah Rukh Khan: అట్లీ బాలీవుడ్‌ ఎంట్రీకి లైన్‌ క్లియరా?

కోలీవుడ్‌ మాస్‌ డైరక్టర్‌ అట్లీ.. బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అంటూ చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. షారుఖ్‌ ఖాన్ హీరోగా ఆ సినిమా ఉంటుందని కూడా వార్తలొచ్చాయి. కానీ ఇన్నాళ్లూ అవి వార్తలగానే మిగిలిపోయాయి. అయితే ఇవి వార్తలు కావు, నిజాలు అని తేలే సమయం దగ్గరకొచ్చింది. అట్లీ సినిమాకు షారుఖ్‌ ఖాన్‌ ఓకే చెప్పేరాట. సినిమా షూటింగ్‌ స్టార్ట్ డేట్‌ని కూడా ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. మాస్‌ మసాలా సినిమాల్ని, తనదైన శైలిలో వినోదం జోడించి తెరకెక్కిస్తుంటాడు అట్లీ.

అయితే అందులో చాలా తెలుగు సినిమాల రిఫరెన్స్‌ కనిపిస్తూ ఉంటుంది. కానీ మన దగ్గర కూడా హిట్‌ అవుతుంటాయి. అది పక్కనపెడితే అట్లీ వరుస సినిమాలు చూసి ఆ మద్య షారుఖ్‌ ఫిదా అయిపోయారట. అందుకే సినిమా చేద్దాం అని అన్నారట. అప్పుడు అన్నమాట … ఈ ఏడాది చివరకు కార్యరూపం దాలుస్తుందట. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక సినిమాను అఫీషియల్‌గా ప్రకటించి… ఏడాది ఆఖరులో ప్రారంభిస్తారట. షారుఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘పఠాన్‌’ అనే సినిమా చేస్తున్నారు.

Muhurtham Fixed For Atlee Shahrukh Khan Movie1

దాని తర్వాత అట్లీ సినిమా మొదలవుతుందట. అయితే రాజ్‌ కుమార్‌ హిరానీ డైరక్షన్‌లో షారుఖ్‌ సినిమా ఉంటుందని ఈ మధ్య వార్తలొచ్చాయి. దీంతో అట్లీ సినిమా మళ్లీ అటకెక్కినట్లేనా అనుకున్నారు. కానీ హిరానీ సినిమా.. అట్లీ సినిమా తర్వాతే అంటున్నారు. సో షారుఖ్‌ను సౌత్‌ మాస్‌ మసాలాలో చూసే రోజు దగ్గరకొచ్చినట్లే.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus