నరేష్ ఇంటి పై దాడి చేసిన దుండగులు.. పోలీసులను ఆశ్రయించిన నరేష్!

చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడిగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు అయిదు తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి ఇంకా విడాకులు తీసుకోకుండానే ఆయనకు దూరంగా ఉంటున్నటువంటి నరేష్ మరొకటి పవిత్ర లోకేష్ తోరిలేషన్ లో ఉన్నారు.

ఈ విషయం కారణంగా నరేష్ రమ్య రఘుపతి మద్య పలు సార్లు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే నరేష్ రమ్య ఇదివరకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ తమ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ వివాదం ద్వారా తరచూ నరేష్ వార్తల్లో నిలుస్తున్నారు అయితే ఈ వివాదం ఇప్పటికే ఎన్నో పరిణామాలకు దారితీసింది.

ఇకపోతే ప్రస్తుతం రమ్యా రఘుపతి నరేష్ మధ్య ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది ఇక గత రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తన గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారంటూ ఈయన ట్రోలర్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఈయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు నరేష్ ఇంటిపై దాడి చేశారంటూ ఈయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కేరవాన్ తో సహా ఇతర వాహనాల అద్దాలు మొత్తం పగలకొట్టారని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదులో భాగంగా ఆయన రమ్మరఘుపతి పేరు ప్రస్తావిస్తూ తన ఇదంతా చేయించింది అంటూ ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలుస్తోంది మరి ఈ విషయంపై రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో ఈ వివాదం ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus