బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్క్ వద్ద ఆదివారం రాత్రి యువ నటి షాలు చౌరసియా పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రాత్రి 8:30 గంటల సమయంలో పార్క్‌కి నైట్ వాక్ కోసం వెళ్లానని, గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని షాలు తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. షాలు ఓ పిల్లా నీ వల్ల, భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు వంటి సినిమాల్లో నటించింది. ఆమె మొబైల్ ఫోన్ దొంగిలించి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిన వ్యక్తితో జరిగిన గొడవలో షాలుకు స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో ఆమె వెంటనే ఇతరుల సహాయంతో 100కి ఫోన్ చేసింది. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. ఇక హీరోయిన్ పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు వేట మొదలు పెట్టారు. ఓ పిల్లా నీ వల్ల, భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు వంటి సినిమాల్లో నటించిన షాలు చౌరసియా మోడల్ గా మంచి గుర్తింపు అందుకొని ఆ తరువాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోంది.
మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీకి తెలుగులో ఇప్పటికే మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వీలైనంత వరకు వచ్చిన అవకాశాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని అనుకుంటోంది.