లావణ్య చేసిన పని వల్ల నెగిటివ్ కామెంట్స్.. టీమ్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల రాక్షసిగా లావణ్య త్రిపాఠికి (Lavanya Tripathi) మంచి గుర్తింపు ఉంది. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లలో నటిస్తున్నా సినిమాలలో మాత్రం ఎక్కువగా నటించడం లేదు. అయితే లావణ్య త్రిపాఠి తాజాగా చేసిన ఒక పనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా అత్తమ్మాస్ కిచెన్ పేజ్ నుంచి ఒక ఫోటో రిలీజ్ కాగా అందులో లావణ్య త్రిపాఠి అత్తగారైన పద్మతో కలిసి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ లావణ్య, పద్మ కనిపించారు.

అయితే లావణ్య, పద్మ చేతులకు గ్లౌస్ ధరించకపోవడం, జుట్టును కూడా అలాగే వదిలేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ జుట్టు ఆవకాయలో పడితే పరిస్థితి ఏంటి అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్తమ్మాస్ కిచెన్ టీమ్ ఈ నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని అవి చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తామని వెల్లడించారు.

ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని టీమ్ సభ్యులు తెలిపారు. లావణ్య, పద్మగారు తమ ఇంటికోసం ఆవకాయ్ చేసుకోవడం అలా కనిపించారని టీమ్ సభ్యులు పేర్కొన్నారు. అత్తామ్మాస్ కిచెన్ టీమ్ సభ్యులు వెల్లడించిన విషయాలు నెటిజన్ల నుంచి వైరల్ అవుతున్నాయి. అత్తమ్మాస్ కిచెన్ టీమ్ ఇలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ లావణ్య కాంబినేషన్ ను మళ్లీ సిల్వర్ స్కీన్ పై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబోలో సినిమా రావడం కష్టమని తెలుస్తోంది. లావణ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus