దువ్వాడ జగన్నాథం గురించి ‘చెప్పను బ్రదర్’ అంటున్న అభిమానులు!
- June 24, 2017 / 10:48 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో మెగా హీరోల సినిమాలు ఎలా ఉన్నా…వాటిని నెత్తిన పెట్టుకుని మరీ సినిమాను ఆడించే సత్తా మాత్రం మెగా ఫ్యాన్స్ కే ఉంది. మిగిలిన హీరోలకు ఎవ్వరికీ లేని ఆ సత్తా ఒక్క మెగా హీరోలకు మాత్రమే ఉండడం వారి గొప్పతనం అనే చెప్పుకోవాలి. అయితే నిన్న రిలీజ్ అయిన డీజె సినిమా ఎలా ఉన్నా మినిమమ్ గ్యారెంటీ అనుకున్నారు బన్నీ ఫ్యాన్స్…కానీ వాళ్ళ లెక్క తప్పింది సినిమా చాలా బోరింగ్ గా…ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది అనే చెప్పాలి. అదే క్రమంలో బ్రాహ్మిన్ పాత్రలో బన్నీ నటన సైతం కాస్త నిరాశనే మిగిల్చింది అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే బన్నీ చేసిన చిన్న తప్పిదం ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అదేలా అంటే…బన్నీ కాస్త అత్యుత్సాహంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ చెప్పను బ్రదర్ అన్న డైలాగ్ ఇప్పటికి హాట్ న్యూస్ గా ఆన్‌లైన్ లో చక్కెర్లు కొడుతూ ఉంది….ఇక ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే పవన్ ఫ్యాన్స్ బన్నిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
ఇక అదే క్రమంలో సినిమా విషయంలో కూడా ఎక్కడా పవన్ ఫ్యాన్స్ బన్నీని వదల్లెదు….నిన్న మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న డిజెని చీల్చి చెండాడుతున్నారు పవన్ ఫ్యాన్స్. సినిమా టాక్ కోసం థియేటర్స్ బయట నిలుచున్న మీడియాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ బన్నీని డైరెక్ట్ అట్యాక్ గానే కనిపిస్తున్నాయి. మీడియా సినిమా ఎలా ఉంది అని అడగగానే…సినిమా పట్ల ఏం చెప్పలేం బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏం చెప్పాలి…చెప్పను బ్రదర్ అంటూ బన్నీపై శెటైర్స్ పడుతూ ఉండడం నిజంగా బన్నీ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. అయితే ఓవర్ ఆల్ గా చూసుకుంటే మాత్రం డీజె బయ్యర్స్ కి నష్టాలనే మిగులుస్తుంది అన్న మాట వాస్తవంగానే కనిపిస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















