సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురు ఉమా మహేశ్వరి మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో వెల్లడించారు. ఎన్టీఆర్ కూతురు అనుమానాస్పద మృతి ఆమె ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. అయితే నందమూరి కుటుంబాన్ని ఆగష్టు శాపం వెంటాడుతోందని నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, నటుడు నందమూరి హరికృష్ణ నాలుగేళ్ల క్రితం 2018 సంవత్సరం ఆగష్టు నెల 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో ఆగష్టు సంక్షోభం ఎదురైన సంగతి తెలిసిందే. ఆగష్టు నెల నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి అసలు కారణాలు వెలుగులోకి రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉమా మహేశ్వరి కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం కావడం గమనార్హం. ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ వైద్యుడు. ఉమా మహేశ్వరికి అవసరమైతే విదేశాలలో కూడా వైద్యం చేయించుకోగలిగే సామర్థ్యం ఉందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు.
ఉమా మహేశ్వరి మొదటి భర్త నరేంద్ర రాజన్ కాగా వీళ్లిద్దరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఉమా మహేశ్వరి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయనకు తన వంతు సహాయం చేశారు. ఉమా మహేశ్వరి మనస్సు చాలా మంచి మనస్సు అని ఇతరులకు కష్టం వస్తే మానవత్వంతో స్పందించి సమస్య పరిష్కారం కోసం ఆమె కృషి చేసేవారని సమాచారం. ఉమా మహేశ్వరి తన కళ్లను దానం చేశారనే సంగతి తెలిసిందే.
మరోవైపు పోస్టుమార్టం నివేదికలో ఉమా మహేశ్వరి మరణానికి సంబంధించి ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయేమో చూడాల్సి ఉంది. ఉమా మహేశ్వరి మరణం వల్ల బింబిసార సినిమాకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు రద్దయ్యాయని సమాచారం అందుతోంది.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?