ఆగస్టు నెల పూర్తయింది. ఈ నెలలో మొత్తంగా 25 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. కచ్చితంగా ప్రేక్షకులని ఎక్కువ శాతం థియేటర్లకు రప్పించే నెల ఇది అవుతుంది అని అంతా ఆశించారు. జూలై నెలతో పోలిస్తే.. కొంచెం పేరున్న సినిమాలు (Movies) రిలీజ్ అవ్వడం వల్ల అందరిలో ఆ అభిప్రాయం కలిగింది. కానీ ఈ నెల ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఆకలి తీర్చలేదు అనే చెప్పాలి. ఆగస్టు నెల ఆరంభం నుండి చూసుకుంటే..
‘అలనాటి రామచంద్రుడు’ ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ ‘బడ్డీ’ (Buddy) ‘లారీ చాప్టర్ 1’ ‘ఉషాపరిణయం’ ‘శివమ్ భజే’ (Shivam Bhaje) ‘తిరగబడరాసామి’ ‘విరాజి’ ‘భవనమ్’ వంటి చిన్న సినిమాలతో పాటు ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) ‘ఆయ్’ (AAY) ‘తంగలాన్'(డబ్బింగ్) (Thangalaan) ‘సింబా’ (Simbaa) వంటి మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెలాఖరులో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ‘కమిటీ కుర్రోళ్ళు’ ‘ఆయ్’ మంచి సక్సెస్..లు అందుకున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు (Movies) భారీ నష్టాలను మిగిల్చాయి. ‘సరిపోదా శనివారం’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలే అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా కలెక్ట్ చేయాలి. మరో రెండు రోజుల్లో..
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవుతుందా లేదా అనే విషయం పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఇదే నెలలో రీ రిలీజ్ సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయి. ‘మురారి’ (Murari) రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ‘ఇంద్ర’ (Indra) కూడా మంచి వసూళ్లు సాధించింది. ‘మాస్’ కి ఎక్కువ ప్రమోట్ చేయకపోవడం వల్ల యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇది ఆగస్టు బాక్సాఫీస్..!