టాలీవుడ్ లో చిన్న క్యారెక్టెర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన అవసరాల శ్రీనివాస్ క్రమక్రమంగా మంచి కధా రచయితగా, మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరో నానితో సమానంగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్. ఆ సినిమాతో మంచి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇక ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న అవసరాల ఒక్కసారే దర్శకుడిగా మారి ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలో నటుడుగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన అవసరాల తర్వాత ఈమధ్యే ‘జ్యో అచ్యుతానంద’సినిమాతో మరో సైలెంట్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా మంచి ఫ్యామిలీ దర్శకుడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రయాణం సాగిస్తున్న క్రమంలో అనుకోకుండా తన మైండ్ లో మెదిలిన ఒక చిన్న ఆలోచన శ్రీనివాస్ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసేసింది. ఇంతకీ ఏమయ్యింది అంటే, బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ తో వచ్చిన సినిమా ‘హంటర్’ తెలుగులో రిమేక్ గా ‘బాబు బాగా బిజీ’గా తెరకెక్కించారు.
కొత్త దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమా దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ దర్శకుడిగా,నటుడిగా ఉన్న అవసరాల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటీ అని చాలా మంది విమర్శించారు. అయితే మనోడు మాత్రం తనదైన స్టైల్ లో సినిమాని ప్రమోట్ చేసుకుంటూ చెలరేగిపోయాడు. దీంతో అవసరాల శ్రీనివాస్ కు ముందు నుంచి వచ్చిన మంచి ఇమేజ్ చేజేతులా నాశనం అయిపోయింది. హింది సినిమాని రీమేక్ చెయ్యడమే రిస్క్, అందులోనూ ఉన్నది ఉన్నట్లు చేస్తే జనాలు ఎలా కనెక్ట్ అవుతారు. స్లో స్క్రీన్‌ప్లే వల్ల సినిమా ఫ్లాప్ కావడమే కాకుండా మన అవసరాలకు ఉన్న మంచి ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయేలా చేసింది. పాపం అవసరాల.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.