Avatar 2: ‘అవతార్2’ క్రిటిక్స్ కి స్పెషల్ షో.. టాక్ ఏంటంటే..?

  • December 9, 2022 / 01:35 PM IST

హాలీవుడ్ సినిమా ‘అవతార్2’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ‘అవతార్’కు సీక్వెల్ గా ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఎలా ఉండబోతుందా..? అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ పెరిగిపోయింది. ఈ క్రమంలో ‘అవతార్2’ సినిమా ప్రీమియర్ ను లండన్ లో హాలీవుడ్ సెలబ్రిటీలు, క్రిటిక్స్ కోసం స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా సినిమాకి రివ్యూ ఇస్తున్నారు. ‘అవతార్’ కంటే ‘అవతార్ 2’ సినిమా ఇంకా గొప్పగా, ఎమోషనల్ గా ఉందని ఎరిక్ డేవిస్ రాసుకొచ్చారు. ఫిల్మ్ మేకర్స్ కి సినిమా ఎలా తీయాలో జేమ్స్ కామెరూన్ చూపించారని..

ఎమోషనల్ పాయింట్, విజువల్స్ పరంగా ‘అవతార్ 2’ ఎపిక్ బ్లాక్ బస్టర్ అవుతుందని జాన్ హోరోవిజ్ తెలిపారు. టెక్నికల్ గా ‘అవతార్2’ ఒక మాస్టర్ పీస్ అని.. జేమ్స్ కెమెరాన్ టాప్ ఫేమ్ లో ఉన్నారని డ్రూ టేలర్ రాసుకొచ్చారు. ఇలా చాలా మంది సెలబ్రిటీలు, క్రిటిక్స్ సినిమా గురించి ట్విట్టర్ లో చాలా గొప్పగా రాసుకొచ్చారు.

పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 3D, 4DX టెక్నాలజీతో ‘అవతార్ 2’ ఇండియాలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఇండియాలో రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus