Avatar2: రెండో ‘అవతార్‌’ టీజర్‌ ట్రైలర్‌ వచ్చేసింది!

హాలీవుడ్‌ సినిమాను ఓ మెట్టు ఎక్కించి.. రికార్డులు మీద రికార్డులు కొట్టి 12 ఏళ్లుగా రారాజుగా నిలిచిన చిత్రం ‘అవతార్‌’. జేమ్స్‌ కామెరూన్‌ నుండి వచ్చిన ఈ చిత్రరాజానికి సీక్వెల్‌ సిద్ధమవుతోందనే విషయం తెలిసిందే. ఆ రెండో ‘అవతార్‌’ టీజర్‌ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఈ ట్రైలర్‌ను చిత్రబృందం ట్విటర్‌లో రిలీజ్‌ చేసింది. చూడటానికి రెండేంటి ఎన్ని కళ్లున్నా చాలవు అన్నట్లుగా రూపొందించారు.

‘అవతార్‌’ సీక్వెల్స్‌ అంటూ జేమ్స్‌ కామెరూన్‌ అనౌన్స్‌ చేయగానే ప్రపంచ సినీ పరిశ్రమ వావ్‌ అనుకుంది. ప్రేక్షకులు అయితే కొత్త పార్ట్‌ ఎప్పుడు అనే ప్రశ్న మొదలెట్టారు. సుమారు ఐదేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా టీజర్‌ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పండోరా గ్రహానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. పండోరాలోని అద్భుతమైన లొకేషన్లు, చూడగానే మైమరపించే నీలి రంగులోని సముద్రాన్ని చూపిస్తారు.

ఆ తర్వాత చాలావరకు సన్నివేశాలు అండర్ వాటర్‌లోనే కనిపిస్తాయి. సినిమా హీరో శామ్ వర్తింగ్‌టన్ పోషించిన జేక్ సల్లీ పాత్ర, హీరోయిన్ జో సల్దానా పోషించిన నేతిరి పాత్రలకు సంబంధించిన కొత్త క్లోజప్ షాట్లను ఈ టీజర్‌ ట్రైలర్‌లో చూడొచ్చు. ఇందులో కొత్తగా జేక్ సల్లీ, నేతిరికి పుట్టిన పిల్లలు కనిపిస్తాయి. వీరు సగం మనుషులు కాగా, సగం పండోరాకు చెందిన నావి జాతికి చెందిన వారు అనే విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్ దత్తత తీసుకున్న జాక్ చాంపియన్ అనే కొత్త పాత్ర ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ ప్రచార వీడిలో పండోరాలోని సముద్ర జీవులను కొత్తగా చూపించారు. పెద్ద పెద్ద సైజులో ఉండటంతో పాటు అక్కడి వారితో స్నేహపూరితంగానే మెలుగుతున్నట్లు చూపించారు. ప్రముఖ నాయిక కేట్ విన్‌స్లెట్‌ను నావి గ్రహానికి చెందిన వ్యక్తిగా చూపించారు దర్శకుడు. ‘నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. మనం ఎక్కడికి వెళ్లినా కుటుంబమే మనకు కోట’ అనే డైలాగ్‌ను కూడా టీజర్‌ ట్రైలర్‌లో చూడొచ్చు. ఆ సమయంలో ఎమోషనల్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, విజువల్స్‌ ఆకట్టుకుంటాయి.

ఇక సినిమా కథేంటి అనే విషయం ఇప్పటికీ తెలియడం లేదు. అదేంటో తెలియాలంటే డిసెంబరు 16 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ థియేటర్లలోకి వస్తుంది. ఇక 2024లో ‘అవతార్ 3’, 2026లో ‘అవతార్ 4’, 2028లో ‘అవతార్ 5’ వస్తాయి.

 

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus