Avatar: మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ గురించి మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

  • April 27, 2022 / 02:52 PM IST

వెండితెరపై జేమ్స్‌ కెమరూన్‌ ఆవిష్కరించిన అద్భుతం ‘అవతార్‌’. 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా పేరు ఇప్పుడు గుర్తొచ్చినా.. కళ్ల ముందు ఓ అద్భుతమైన లోకం కనిపిస్తుంది. అంతలా జనాల్ని తన దర్శకత్వ ఆలోచనలతో హిప్నటైజ్‌ చేసేశారు జేమ్స్‌ కెమరూన్‌. ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని, అది కూడా ఒకటి కాదని, ఓ మూడు వస్తాయని చెప్పారు. చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సీక్వెల్స్‌లో మొదటిది అంటే ‘అవతార్‌ 2’ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Click Here To Watch NOW

డిసెంబరు 16న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఆ మధ్య ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమాను సుమారు 160 భాషల్లో విడుదల చేస్తారట. ఓ సినిమా ఇన్ని భాషల్లో విడుదలవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు ఈ సినిమా గ్లింప్స్‌ను ‘సినిమా కాన్‌’ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ‘అవతార్‌’కి ఒక సీక్వెల్‌ కాదు నాలుగు సీక్వెల్స్‌ ఉంటాయని జేమ్స్‌ కామెరూన్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

ఇప్పుడు వస్తున్న ‘అవతార్‌ 2’ కోసం జేమ్స్‌ 2017 నుండి పని చేస్తున్నారు. కరోనా కష్టాలు, ఇతర పనుల వల్ల సినిమాల ఆసల్యమవుతూ వస్తోంది. తాజాగా డిసెంబరు 16 డేట్ అనౌన్స్‌ చేశారు. ఆ రోజు మరోసారి సినిమా ప్రేక్షకులు పండోరా గ్రహాన్ని చూడొచ్చు. 13 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ సారి సినిమా మరింత టెక్నాలజీ అందిపుచ్చుకుని అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మిగిలిన మూడు సీక్వెల్స్‌ ఎప్పుడొస్తాయి అన్నదీ ముందే చెప్పేశారు.

మొత్తంగా 2028లోపు ఆ సీక్వెల్స్‌ తెచ్చేయాలనేది ఆలోచనట. ప్రతి సీక్వెల్‌ డిసెంబరులోనే ఉంటుంది. ‘అవతార్‌ 3’ని 2024 డిసెంబరు 20న తెస్తారు. నాలుగో ‘అవతార్‌’ డిసెంబరు 18, 2026లో వస్తుందట. ఇక ఆఖరిదైన ‘అవతార్‌ 5’ను 22 డిసెంబరు 2028లో విడుదల చేస్తారట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus