ప్రియుడితో బీచ్ లో చక్కర్లు కొడుతోన్న అవికా గోర్!

బాలీవుడ్ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగులోనూ క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావా’ వంటి సినిమాలతో హిట్లు అందుకుంది. చివరిగా ఆమె తెలుగులో ‘రాజు గారి గది 3’ సినిమాలో కనిపించింది. చాలా కాలం పాటు సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా బరువు తగ్గి నాజూకుగా మారింది.

ఆమె సన్నబడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తను సన్నబడడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి అందరికీ షాకిచ్చింది. నిజానికి బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు అవికా తన సహనటుడితో ప్రేమాయణం సాగించింది వార్తలు వినిపించాయి. కానీ వారి ప్రేమ ఎక్కువకాలం సాగలేదని.. బ్రేకప్ అయిందని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. బ్రేకప్ తరువాత సినిమాలతో బిజీ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది.

మిలింద్ చద్వానీ అనే వ్యక్తితో అవికా ప్రేమలో ఉంది. ఈ మేరకు ఆమె కొన్ని ఫొటోలు రివీల్ చేసింది. నా లైఫ్ లో ప్రేమ దొరికింది.. నన్ను అర్థం చేసుకొని, నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి దొరకడం నా అదృష్టం అంటూ ఎమోషనల్ గా కవిత రాసుకొచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లిపై కూడా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో తామిద్దరం పెళ్లి చేసుకోమని.. ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవం అంటూ పేర్కొంది.


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus