Avika Gor: ఓటీటీలో అవికా గోర్ ”నెట్” రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ మధ్య కాలంలో కామెడీ పాత్రల ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న కమెడియన్లలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి రాహుల్ రామకృష్ణ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన “నెట్” సినిమా సెప్టెంబర్ నెల 10వ తేదీన ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

వినాయకచవితి పండుగ కానుకగా విడుదలవుతున్న నెట్ సినిమా జీ5 ఒరిజినల్ ఫిల్మ్ కావడం గమనార్హం. అవికాగోర్, దక్షి గుత్తికొండ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో అదే సమయంలో ఇంటర్నెట్ వాడకం విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల అనేక మోసాలు జరుగుతున్నాయి. స్పై కెమెరాల ద్వారా జరుగుతున్న మోసాల గురించి ప్రధానంగా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. అవికాగోర్ ఈ సినిమాతోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించని అవికా గోర్ వరుసగా ఆరు సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. “మాట్లాడే ప్రతి మాట వేసే ప్రతి అడుగు గమనించబడుతుంది” అంటూ సినిమా రిలీజ్ డేట్ తో విడుదలైన పోస్టర్ “నెట్” పై అంచనాలను పెంచింది. అవికా గోర్ పంజరంలో చిక్కుకుని కన్నీళ్లతో భయంభయంగా చూస్తున్న పోస్టర్ “నెట్” మూవీపై అంచనాలను నెలకొంది. తమడా మీడియా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు భార్గవ్ మంచర్ల దర్శకత్వం వహిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus