బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఉంటారు. అయితే, కలిసికట్టుగా గేమ్ ఆడేటపుడు మాత్రం వారి మద్యలో విభేదాలు అనేవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో అసలు హౌస్ లో ఎలా ఉండాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు , మీలో వచ్చిన మార్పులు ఏంటి అని అడిగాడు బిగ్ బాస్. ఒక్కొక్కరు ఒక్కో మార్పు చెప్పారు. ఇందులో భాగంగానే అవినాష్ తనలో వచ్చిన మార్పుని చెప్పాడు.
అంతకుముందు అస్సలు ధైర్యం ఉండేది కాదని, ఎన్నో కష్టాలు పడుతూ మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేవాడ్ని కాదని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత లాస్య, అరియానా, మోనాల్, హారిక వీళ్లు చెప్పిన స్టోరీలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఆడపిల్లలే అంత ధైర్యంగా ఉంటున్నపుడు నేను ఎందుకు ధైర్యంగా ఉండకూడదు అని నేర్చుకున్నానని చెప్పాడు అవినాష్.
అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నెలవారి వాయిదాలు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాని చెప్పాడు అవినాష్. అప్పుడు అమ్మరాజశేఖర్ ఫుల్ క్లాస్ పీకారు కూడా. ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోతున్నానని తెలిసి బాగా భావోద్వేగానికి గురి అయ్యాడు. చాలా ఎమోషనల్ అయిపోయాడు. బయటకి వస్తే బతుకులేదు అని చాలా బాధపడ్డాడు. ఎలిమినేట్ అయిపోతున్నానేమో అంటూ చాలా బాధపడ్డాడు అవినాష్. కానీ ఇప్పుడు తనకి ధైర్యం వచ్చిందని చెప్పడం అనేది కొసమెరుపు. అదీ మేటర్.