‘జబర్దస్త్’ షోని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న అవినాష్!

‘జబర్దస్త్’ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో తన కామెడీతో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా పేరు సంపాదించినా.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అవినాష్ చేసే కామెడీని అన్ని సందర్భాల్లో స్వీకరించడానికి ఇంటి సభ్యులు సిద్ధంగా లేరు. అవినాష్.. పదే పదే పంచ్ లు వేస్తూ.. బాడీ షేమింగ్ చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోయెల్ కాలికి గాయమైతే అతడిని ఇమిటేట్ చేయడం, హారిక హైట్ ను హేళన చేయడం లాంటివి వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

అయితే గతవారం నామినేట్ అయి ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న అవినాష్.. తొమ్మిదో వారంలో కూడా నామినేట్ కావడంతో ఎమోషనల్ అవుతున్నాడు. ఈ క్రమంలో తన కెరీర్ గురించి ఆలోచనలో పడ్డాడు. రీసెంట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో నామినేషన్స్ అనంతరం తన పరిస్థితిని తలచుకుంటూ సోహైల్, అరియానాల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌస్ లో అందరూ ఉండడానికే వచ్చారని.. అందరికీ సమస్యలున్నాయని చెప్పిన అవినాష్. తన మైండ్ లో ఒక ఆలోచన ఉండిపోయిందని అన్నారు.

ఎన్నో అవమానాలు పడి బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు.. తనను ఓ షో(జబర్దస్త్) నుండి బయటకు పంపించేశారని చెప్పాడు. మళ్లీ తీసుకోనని చెప్పారని.. అవన్నీ గుర్తుకు వచ్చి చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత తనతో పాటు అందరూ స్ట్రాంగ్ గా ఆడుతుండడం సంతోషాన్నిస్తుంది.. ధైర్యంగా మాట్లాడాడు. గతంలో అవినాష్ బిగ్ బాస్ హౌస్ కి రావడం కోసం ‘జబర్దస్త్’ యాజమాన్యానికి రూ.10 లక్షలు చెల్లించాల్సి వచ్చిందంటూ వార్తలొచ్చాయి. ఇది నిజమైతే.. బిగ్ బాస్ హౌస్ కి రావడం కోసం అవినాష్ చాలా కష్టపడ్డానిపిస్తోంది. మరి హౌస్ లో తనకు ఎదురవుతోన్న అవరోధాలు దాటుకొని టైటిల్ అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus